E-Paper
Advertisement

Action Thriller OTT: భయంకరమైన కుట్రలు… బలయ్యేది డిఫెన్స్ ఆఫీసర్లు… ఊర మాస్ రివేంజ్ మావా

Action Thriller OTT: భయంకరమైన కుట్రలు… బలయ్యేది డిఫెన్స్ ఆఫీసర్లు…  ఊర మాస్ రివేంజ్ మావా
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో ఒక యాక్షన్ థ్రిల్లర్ దుమ్ము దులుపుతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ కి ఐయండిబిలో 7.9/10 రేటింగ్ కూడా ఉంది. ఒక్కో ఎపిసోడ్ చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఒక నేవీ కమాండర్, తన బృందంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సిరీస్ కథ. తన కుటుంబం, స్నేహితుల మరణం వెనుక ఉన్న కుట్రను అతను ఎలా ఛేదించాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘టెర్మినల్ లిస్ట్’ (The Terminal List). మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2022 జూలై 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో టేలర్ కిట్ష్, కాన్స్టాన్స్ వూ నటించారు. రెండో సీజన్ చిత్రీకరణ 2025 చివరి నాటికి పూర్తయింది. ఇది 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కథ జాక్ కార్ రాసిన ‘ట్రూ బిలీవర్’ పుస్తకం ఆధారంగా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నేవీ ఆఫీసర్ జేమ్స్ రీస్ ఒక ముఖ్యమైన మిషన్‌లో ఉన్నప్పుడు, తన టీమ్ మొత్తం శత్రువుల దాడిలో చనిపోతుంది. రీస్ ఒక్కడే ప్రాణాలతో బయటపడి ఇంటికి తిరిగి వస్తాడు. అయితే ఆ మిషన్ ఎందుకు ఫైల్ అయిందో అర్థం కాకుండా ఉంటుంది. ఇక అతనికి ఉన్న జ్ఞాపకాలకు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలకు అస్సలు సంబంధం ఉండదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో, అతని కుటుంబంపై కూడా దాడి జరుగుతుంది. ఈ దాడిలో తన ప్రాణంగా ప్రేమించే భార్యాబిడ్డలను కూడా పోగొట్టుకుంటాడు.

ఈ క్రమంలో తన సొంత టీమ్‌ని, తన కుటుంబాన్ని బలితీసుకున్నది ఎవరో కాదు, ప్రభుత్వంలో పెద్ద తలకాయలుగా తెలుస్తుంది. తన వారిని అన్యాయంగా చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రీస్ ఒక లిస్ట్‌ను తయారు చేసుకుంటాడు. ఒక సీల్‌ ఆఫీసర్‌గా తనకున్న తెలివితేటలను ఉపయోగించి ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరినీ వెతికి మరీ వేటాడతాడు. కేవలం తుపాకులతోనే కాకుండా, మైండ్ గేమ్ ఆడుతూ ఎలా  శత్రువులను మట్టుబెట్టాడనేదే ఈ థ్రిల్లింగ్ కథ.

Advertisement

Read Also :  జైల్లోనే క్రిమినల్స్ తుక్కురేగ్గొట్టే పోలీస్…. ఇది నెక్స్ట్ లెవెల్ బ్లడ్ బాత్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×