E-Paper
Advertisement

సూపర్ హీరోలందరినీ చంపేసే క్రూరత్వం… మైండ్ బ్లోయింగ్ యానిమే సూపర్ హీరో సిరీస్

సూపర్ హీరోలందరినీ చంపేసే క్రూరత్వం… మైండ్ బ్లోయింగ్ యానిమే సూపర్ హీరో సిరీస్
Advertisement

Animated Action Series: ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్, హర్రర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిందా ? కొంచం కొత్తగా ఏదైనా చూడాలి అనుకుంటున్నారా ? అయితే ఈ సిరీస్ మీ కోసమే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాక్షనే కదా అని లైట్ తీసుకోకండి. ఇది యానిమే సిరీస్ కావడం విశేషం. సాధారణ యానిమే సిరీస్ అయితే కిక్కేం ఉంది. ఇందులో మామూలు సిరీస్, సినిమాలలో ఉండే హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు, స్క్రీన్ ముందు నుంచి ఈ సిరీస్ ను చూస్తున్నంత సేపు చూపు తిప్పుకొనివ్వకుండా చేయడానికి కావలసిన అన్నీ అంశాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన సిరీస్ ఏమిటంటే ఈ యానిమే సిరీస్ పెద్దలకు మాత్రమే. ‘Invincible’ (ఇన్విన్సిబుల్) అనే టైటిల్ తో ఓటీటీలోకి వచ్చిన ఈ అమెరికన్ అడల్ట్ యానిమేటెడ్ సూపర్‌హీరో వెబ్ సిరీస్ ను తెలుగులో ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

యానిమే అనగానే పిల్లల బొమ్మలు అనుకుంటారు. కానీ ఈ సిరీస్ మాత్రం ఊహించని ట్విస్ట్‌లు, వయొలెన్స్ తో సాగే పక్కా అడల్ట్ సిరీస్. మార్క్ గ్రేసన్ అనే 17 ఏళ్ల కాలేజీ కుర్రాడు ఇందులో హీరో. అతనికి అకస్మాత్తుగా సూపర్ పవర్స్ రావడం షురూ అవుతుంది. భూమిపైనే అత్యంత శక్తివంతమైన సూపర్‌ హీరో అతని తండ్రి నోలన్ గ్రేసన్. తండ్రి పర్యవేక్షణలో మార్క్ తన శక్తులను ఎలా వాడాలో నెమ్మదిగా తెలుసుకుంటాడు. పవర్స్ అన్నీ ఎలా వాడాలో నేర్చుకున్నాక తనకి తానే ‘ఇన్విన్సిబుల్’ అని పేరు పెట్టుకుని లోక రక్షణ కోసం రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలోనే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

Advertisement

కథ అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న టైమ్ లో భూమిని కాపాడే టాప్ సూపర్‌ హీరోల బృందం ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్లోబ్’ మొత్తం దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ హంతకుడు మరెవరో కాదు, మార్క్ సొంత తండ్రి అయిన ఓమ్ని-మ్యాన్ అని హీరో కనిపెడతాడు. అసలు రహస్యం ఏంటంటే ఓమ్ని-మ్యాన్ భూమిని రక్షించే హీరో కాదు. అతను ‘విల్‌ట్రమ్’ (Viltrum) అనే గ్రహానికి చెందిన ఒక క్రూరమైన ఏలియన్ సామ్రాజ్య సైనికుడు. భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చేసిన ప్లాన్ లో భాగంగానే అందరు సూపర్ హీరోలని చంపేస్తాడు.

తన తండ్రి నిజ స్వరూపం తెలిసిన మార్క్ ఏం చేశాడు ? భూమిని జయించాలనుకున్న సొంత తండ్రిని ఎదిరించి మార్క్ భూలోకాన్ని ఎలా కాపాడాడు ? అనేదే మొదటి రెండు సీజన్లలో సాగే రసవత్తరమైన కథ. ఈ సిరీస్‌ ను Amazon Prime Videoలో వీక్షించవచ్చు. ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్ లతో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి 2 సీజన్లు కలిసి మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అయితే రెండు సీజన్లే తెలుగులో ఉన్నాయి. ఆ తర్వాతి సీజన్లు కేవలం ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీన్ని పిల్లలతో కలిసి చూడకపోతేనే బెటర్.

Advertisement

Read Also: ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు.. నెట్‌ఫ్లిక్స్‌ను రూల్ చేస్తోన్న నెంబర్ 1 సిరీస్ ఇదే!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×