E-Paper
Advertisement

OTT Movie : ఇద్దరు అబ్బాయిలతో అమ్మాయి ప్రేమ కథ… క్లైమాక్స్ ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇద్దరు అబ్బాయిలతో అమ్మాయి ప్రేమ కథ… క్లైమాక్స్ ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక రొమాంటిక్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది ఒక ట్రాయాంగిల్ లవ్ స్టోరీ. అయితే రొటీన్ గా అనిపించినా, టాక్సిక్ రిలేషన్‌షిప్‌ను బో*ల్డ్‌గా చూపించడం, రియలిస్టిక్ ఫీల్ తో ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేమికులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. మరాఠీ ఇండస్ట్రి నుంచి వచ్చిన ఈ సినిమాలో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో వచ్చిన ఈ మరాఠీ రొమాంటిక్ మూవీ పేరు ‘ఆర్పార్’ (Aarpar). ఇది 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి గౌరవ్ పట్కీ దర్శకత్వం వహించారు. ఇందులో లలిత్ ప్రభాకర్, హృతా దుర్గులే ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుహితా థట్టే, మాధవ్ అభ్యంకర్, స్నేహలతా వాసైకర్ నటించారు. సుమారు 2 గంటల 8 నిమిషాల ఈ సినిమాకి గుల్రాజ్ సింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో 2025 నవంబర్ 7 నుంచి అందుబాటులో ఉంది. IMDbలో 6.5/10 రేటింగ్ ని కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమర్ (లలిత్ ప్రభాకర్), ప్రాచీ (హృతా దుర్గులే) కాలేజ్ లో మంచి స్నేహితులు. ఆ స్నేహం గాఢమైన ప్రేమగా మారుతుంది. ఇక వాళ్ళిద్దరూ ప్రేమ అనే ఒక అందమైన లోకంలో మునిగిపోతారు. అయితే ప్రాచీ తన మరో స్నేహితుడైన షామిన్‌తో చనువుగా ఉండటం అమర్‌కి నచ్చదు. దీంతో వాళ్ళ మధ్య అపార్థాలు తలెత్తుతాయి. అతనితో చనువుగా ఉంటే, అమర్ లో మాత్రం విపరీతమైన కోపం వస్తుంటుంది. ఒకానొక సందర్భంలో షామిన్‌ను చంపాలనే ఉద్దేశంతో వెళ్తుండగా అమర్‌కు ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ సంఘటనలతో విసిగిపోయిన ప్రాచీ, అతని నుండి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది.

కాలేజ్ నుంచి వీళ్ళు విడిపోయాక కెరీర్, కుటుంబ బాధ్యతల్లో పడతారు. విడిపోయినా ఒకరినొకరు మర్చిపోలేక అమర్, ప్రాచీలు మానసికంగా ఇబ్బంది పడతారు. ఇక తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమర్ వేరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ సమయంలో వచ్చే సీన్స్ ఆసక్తిగా ఉంటాయి. చివరికి ఆ జంట తమ విభేదాలను పక్కన పెట్టి ఒక్కటయ్యారా ? వేరే వాళ్ళతో జీవితాలను పంచుకుంటారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also :  అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×