E-Paper
Advertisement

కొడుకు ప్రాణాల కోసం డాక్టర్ క్లీనింగ్ పని… మాఫియాతో కలిసి మతిపోగొట్టే పనులు

కొడుకు ప్రాణాల కోసం డాక్టర్ క్లీనింగ్ పని… మాఫియాతో కలిసి మతిపోగొట్టే పనులు
Advertisement

Crime Thriller Series : తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక డాక్టర్ తల్లి క్లీనింగ్ లేడీగా ఎలా మారింది ? మాఫియా ప్రపంచంలోకి ఎలా దిగింది ? అనే స్టోరీ లైన్ తో రూపొందిన కరజే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ది క్లీనింగ్ లేడీ’ (The Cleaning Lady). నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ లో ఒక సాధారణ డాక్టర్ ను ఉన్న అద్భుతమైన స్కిల్స్ వల్ల ఆమె జీవితం ఎలా ఒక్కసారిగా మారిపోయి, డేంజరస్ గేమ్‌ లోకి ఎలా నెట్టేసిందనే ఉత్కంఠభరితమైన కథతో సాగుతుంది. మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ కథ ఏంటి ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

థోనీ డి లా రోసా తెలివైన, ధైర్యవంతురాలైన డాక్టర్. ఆమె మనీలాలోని ఒక పెద్ద ఆసుపత్రిలో బెస్ట్ సర్జన్‌గా పని చేస్తుంది. కానీ ఆమె 5 ఏళ్ల కొడుకు లూకా ఒక అరుదైన, ప్రమాదకరమైన ఇమ్యూనో డెఫిషియన్సీ రోగంతో బాధపడుతుంటాడు. అతనికి అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫిలిపిన్స్‌లో ఆ చికిత్స సాధ్యం కాదు. అందుకే థోనీ తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో అమెరికా వెళ్తుంది. లాస్ వెగాస్‌లో అత్యుత్తమ హాస్పిటల్‌ లో ట్రీట్‌మెంట్ అందించాలని ఆశిస్తుంది. కానీ వీసా గడువు ముగిసిపోవడంతో ఆమె చట్టవిరుద్ధ వలసదారుగా మారిపోతుంది.

Advertisement

అందుకే లూకా తన కొడుకుకు ట్రీట్మెంట్ చేయించలేకపోతుంది. డబ్బు ఉండదు, అలాగే అక్కడ ఎవ్వరి నుంచీ సహాయం అందదు. ఈ పరిస్థితుల్లో థోనీ ఇళ్లు, ఆఫీసులు శుభ్రం చేసే సాధారణ క్లీనింగ్ లేడీగా పని చేయడం మొదలు పెడుతుంది. ఆమె వైద్య పరిజ్ఞానం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఒకరోజు రాత్రి ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక పెద్ద ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు థోనీ ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షి అవుతుంది.

అండర్‌గ్రౌండ్ మాఫియా ముఠా ఒక వ్యక్తిని ఘోరంగా చంపడాన్ని ఆమె కళ్ళారా చూస్తుంది. సాక్ష్యాలు లేకుండా చేయాలని ముఠా ఆమెను కూడా చంపాలని చూస్తుంది. కానీ థోనీ భయపడకుండా, తాను ఒక డాక్టర్ అని చెప్పి, నేరం జరిగిన స్థలాన్ని ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు దొరకకుండా క్లీన్ చేయగలనని మాఫియా లీడర్ అర్మాన్ మోరల్స్‌తో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ డీల్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అర్మాన్ ఆమె క్లీనింగ్ నైపుణ్యం చూసి ఇంప్రెస్ అవుతాడు. లూకా చికిత్సకు అవసరమైన డబ్బు, మెడికల్ సపోర్ట్ ఇస్తానని మాట ఇస్తాడు.

Advertisement

కానీ దానికి బదులుగా థోనీ మాఫియా చేసే హత్యలు, నేరాల తర్వాత వచ్చే క్రైమ్ సీన్స్‌ను ఎలాంటి ఆధారాలు మిగులకుండా క్లీన్ చేసే “ది క్లీనింగ్ లేడీ”గా ఆమె తన దగ్గర పని చేయాలని షరతు పెడతాడు. దీంతో ఆమె ఒకవైపు క్రూరమైన మాఫియా కోసం పని చేస్తూ… మరోవైపు FBI ఏజెంట్ గారెట్ మిల్లర్ కంట్లో పడుతుంది. FBI ఆమెను ఇన్ఫార్మర్‌గా మార్చుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుంది. తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి థోనీ డబుల్ గేమ్ ఆడుతుంది. మరి ఒక పక్క మాఫియా… మరోపక్క చట్టాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది ? ఆమె డాక్టర్ నాలెడ్జ్ తో ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడింది ? ఈ క్రమంలో ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొంటుంది ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ‘ది క్లీనింగ్ లేడీ’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×