E-Paper
Advertisement

120 Bahadur OTT : చైనా-భారత యుద్ధం ఆధారంగా తెరకెక్కిన వార్ డ్రామా ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

120 Bahadur OTT : చైనా-భారత యుద్ధం ఆధారంగా తెరకెక్కిన వార్ డ్రామా ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

120 Bahadur OTT : వార్ డ్రామాలకంటూ ఓటీటీలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. థియేటర్లలో వాటి రెస్పాన్స్ ఎలా ఉన్నా డిజిటల్ రిలీజ్ లో మాత్రం దుమ్మురేపుతాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మాత్రం తెగ్గేదే లేదని ఏకంగా భారీ వ్యూస్ తో ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు జనాలు. ఇక అలాంటి సినిమాలను ఇష్టపడే వారికోసం రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ వార్ డ్రామా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటి? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన లేటెస్ట్ వార్ డ్రామా ‘120 బహదూర్’ (120 Bahadur Movie). ఫర్హాన్ మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రను పోషించాడు. గత ఏడాది నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు రజ్నీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహించగా, రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ట్రిగ్గర్ హ్యాపీ స్టూడియోస్ బ్యానర్‌లపై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ, అమిత్ చంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంకిత్ సివాచ్, వివాన్ భటేనా కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చినప్పటికీ, ‘120 బహదూర్’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం రూ. 20 కోట్లు మాత్రమే వసూలు చేసి సరిపెట్టుకుంది.

Advertisement

ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా చూడాలంటే ఒక షాకింగ్ కండిషన్ పెట్టారు. మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఓటీటీలో చూడాలన్నా థియేటర్లలో టికెట్ ధరల మాదిరే ఓటీటీలోనూ అద్దెగా రూ. 349 చెల్లించాలి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే… జనవరి 16 నుండి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్‌లకు ‘120 బహదూర్’ మూవీ ఫ్రీగా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : కుప్పలు తెప్పలుగా వలస పిల్లల మిస్సింగ్ కేసులు… ఈ మిస్టరీకి మైండ్ బ్లాక్… మిస్సవ్వకుండా చూడాల్సిన కోర్టు రూమ్ డ్రామా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

120 బహదూర్ చిత్రం 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో ప్రధాన ఘట్టాలలో ఒకటైన రెజాంగ్ లా యుద్ధం నుండి ప్రేరణ పొందింది. ఈ యుద్ధంలో 13వ కుమావోన్ రెజిమెంట్‌ చార్లీ కంపెనీకి చెందిన 120 మంది సైనికులు 3,000 మందితో కూడిన చైనా ఆర్మీ దళానికి వ్యతిరేకంగా పోరాడి తమ స్థానాన్ని కాపాడుకున్నారు. తీవ్రమైన వేడిలో, ఫిరంగి దళాల మద్దతు లేకుండా దాదాపు చైనా సైనికులకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. మన సైనికులు చావుకు చలించకుండా ప్రాణ త్యాగం చేస్తూనే, చైనా దళాల వెన్నులో వణుకు పుట్టించారు. చివరకు 120 మంది సైనికులలో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మరి ఈ యుద్ధం ఎలా జరిగింది ? ఆ 6 మంది సైనికులు ఎలా ప్రాణాలతో బయట పడ్డారు ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×