E-Paper
Advertisement

CM Revanth Reddy: సంక్రాంతికి కాంగ్రెస్ లో పదవుల భర్తీ..

CM Revanth Reddy: సంక్రాంతికి కాంగ్రెస్ లో పదవుల భర్తీ..
Advertisement

CM Revanth Reddy:  పార్టీ సంస్థాగత బలోపేతంపై హస్తం పార్టీ నేతలు ఫోకస్ చేశారట. అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించే పార్టీ కమిటీల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈనెలలోనే పార్టీ కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందట. జిల్లా, మండల స్థాయి పార్టీ కమిటీలన్నీ సంక్రాంత్రి లోపు ఏర్పాటు చేయాలని హైకమాండ్ భావిస్తుందట. పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ పదవుల్లో ప్రయారిటీ లభిస్తోందంటున్నారు.

సంస్థాగత బలోపేతంపై హస్తం పార్టీ నేతలు ఫోకస్

పార్టీ సంస్థాగత బలోపేతంపై హస్తం పార్టీ నేతలు ఫోకస్ చేశారట. అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించే పార్టీ కమిటీల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈనెలలోనే పార్టీ కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందట. జిల్లా, మండల స్థాయి పార్టీ కమిటీలన్నీ సంక్రాంత్రి లోపు ఏర్పాటు చేయాలని హైకమాండ్ భావిస్తుందట. పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ పదవుల్లో ప్రయారిటీ లభిస్తోందంటున్నారు.

సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా జిల్లాల్లో జంబో కమిటీల ఏర్పాటు ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఊపిరి పోయాలని అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన రెండేళ్ల తర్వాత, కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడింది. కేవలం ప్రభుత్వంపైనే కాకుండా, పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టిన అధిష్టానం.. సంక్రాంతి లోపు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఇటీవల కొత్త డీసీసీల ప్రకటించిన పార్టీ.. త్వరలో జిల్లా, మండల స్థాయి కమిటీలన్నీ ఏర్పాటు చేయాలని భావిస్తుందట. ఇందులో భాగంగానే అన్ని జిల్లా పార్టీల్లో కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందట.

ఎక్కువ మందికి అవకాశం కల్పించడానికి జంబో కమిటీలు

గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వాలనేది పీసీసీ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. అందుకే ఈసారి పరిమిత సంఖ్యలో కాకుండా, ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా జిల్లాల్లో జంబో కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారంట. జిల్లా కమిటీలు, మండల కాంగ్రెస్ కమిటీల్లో చురుకైన వారికి చోటు దక్కేలా అడుగులు వేస్తున్నారట. ట్రెజరర్, అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హోదాలో కమిటీలు ఏర్పాటు కానున్నాయట. ఇక ఈ కమిటీల ఏర్పాటు పూర్తి కాగానే ​రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు టాక్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు​విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారట.

సంక్రాంతి లోపు జిల్లా కమిటీల నియామకం

Advertisement

పదవుల కోసం పైరవీలకు తావులేకుండా, నిబద్ధత గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట. సామాజిక సమీకరణాలను పాటిస్తూ, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతుందనే నేతల చెబుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని తుది జాబితాను సిద్ధం చేస్తున్నారట. అన్ని జిల్లాల నుంచి లిస్ట్ రెడీ అయితే, సంక్రాంతి పండుగ లోపు లేదా జనవరి రెండో వారం నాటికి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చిన హుషారులో ఉన్న క్యాడర్‌కు, ఈ పదవుల పంపకం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి పార్టీలో అందర్ని సంతృప్తి పరిచేలా పదవుల పందారం ఎలా జరుగుతుందో?

Story By Ramireddy, Big Tv

 

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×