E-Paper
Advertisement

బెంగళూరు సిటీ.. లోదుస్తుల వీరుడు చిక్కాడు, సీసీటీవీ సాక్షిగా

బెంగళూరు సిటీ.. లోదుస్తుల వీరుడు చిక్కాడు, సీసీటీవీ సాక్షిగా
Advertisement

Bengalugu city: సిటీల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ బెంగుళూరు సిటీలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహిళల లోదుస్తులు దొంగిలిస్తాడు ఓ వ్యక్తి.  వాటిని ధరించి మరుసటి రోజు రాత్రికి తీసిన స్థానంలో వాటిని పెడతారు. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించి ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బెంగళూరు సిటీ విచిత్రమైన కేసు-బెంగళూరు సిటీలోని వివిధ ప్రాంతాల్లో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. మహిళలు తమ ఇంటిపై ఉతికి ఆరేసిన లోదుస్తులు రాత్రికి రాత్రి మాయం అయ్యేవి. ఆశ్చర్యకరంగా పోయిన లోదుస్తులు  మరుసటి రోజు మళ్లీ ప్రదేశంలో తిరిగి ప్రత్యక్షం అయ్యేవి. ఈ విషయాలు బయట పెట్టలేక మహిళలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉండేవి.

Advertisement

మహిళల లోదుస్తులు మాయం చేసే వీరుడు చిక్కాడు-ఈ విషయాన్ని కొందరు మహిళలు పోలీసుల దృష్టికి తెచ్చారు. చివరకు పోలీసుల సహకారంతో ఈ మిస్టరీని ఛేదించేందుకు మహిళలు..  టెర్రాస్‌పై ఎవరికీ కనపడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జులై 2న  తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వ్యక్తి కదలికలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ః

టెర్రాస్‌పై సీక్రెట్ కెమెరాలకు చిక్కాడు-అందులో ఓ యువకుడు టెర్రాస్‌పైకి ఎక్కి  ముందు రోజు దొంగిలించిన లోదుస్తులను అక్కడ పెట్టడం కనిపించింది. కొత్తగా ఆరేసిన వాటిని తీసుకుని వెళ్లడం కనిపించింది. ఆయా దుస్తులు ధరించి అసభ్యంగా ప్రవర్తించడం అందులో రికార్డు అయ్యింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

నిందితుడికి వింత సమస్య-చివరకు  నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వాడి పేరు అబ్దుల్ హుస్సేన్‌..వయస్సు 23 ఏళ్లు, అస్సాంకు చెందినవాడు. నిందితుడికి మానసిక సమస్య ఉన్నట్లు తేలింది. మహిళల లోదుస్తులను దొంగిలించి వాటిని ఒకసారి ధరించి వాటిని తిరిగి ఇచ్చేసి కొత్తవి తీసుకునేవాడని తెలిపారు.

ALSO READ: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

అంతేకాదు మహిళల వ్యవహారశైలి తగినట్టుగా కనిపించేవాడని తెలిపారు పోలీసులు. ఇలాంటి ఘటనలు గతంలో తాము నిర్ధారించామని తెలిపారు. ఈ తరహా కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి చాన్నాళ్లుగా సిటీలోని వివిధ మహిళలను వెంటాడుతున్న సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×