E-Paper
Advertisement

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా
Advertisement

Pune Crime: ప్రియురాలు తన ప్రియుడ్ని దారుణంగా హత్య చేసింది. బాడీని ముక్కముక్కలు చేసి ఓ సంచిలో మూత కట్టేసింది. ఆ సంచిని బాత్‌రూంలో పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. చివరకు ఇంటి యజమానికి వాయిస్ మేసెజ్ పంపించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది? సంచలనం రేపిన ఈ ఘటన పూణెలో వెలుగు చూసింది.

పూణెలో దారుణమైన ఘటన-మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. కళ్యాణ్‌ ప్రాంతంలో దారుణమైన ఘటన బయటపడింది. నీలకంఠ అపార్ట్‌మెంట్‌లోని 104వ ఫ్లాట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి వయస్సు 37 ఏళ్లు. అతడ్ని హమీదుల్లా ఇస్లాంగా గుర్తించారు. అతడ్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్న మహిళ హసీబాగా గుర్తించారు పోలీసులు.

Advertisement

ప్రియుడ్ని చంపి, మృతదేహం సంచిలో-ఫ్లాట్ నుంచి నడవలోకి నీరు రావడంతో మిగతా ఫ్లాట్‌లోని సభ్యులు ఇంటి ఓనర్‌కు రెండున్నర నెలలుగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్లాట్‌లో అద్దెకున్న మహిళ నుండి ఓనర్ కు ఓ వాయిస్ మెసేజ్ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. బాత్రూమ్‌లో ఒక మృతదేహం ఉందని, కుళాయి నుండి నీళ్లు కారుతున్నాయని ఆ మెసేజ్‌లో హెచ్చరించింది.

ఇంటి ఓనర్‌కి వాయిస్ మెసేజ్-దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికి తలుపుకి బయటి తాళం వేసి ఉంది. పగలగొట్టి చూడగా బాత్రూమ్‌లో ఓ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం.. హమీదుల్లా-హసీబా సుమారు రెండున్నర నెలలుగా ఆ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. కాకపోతే పదునైన ఆయుధంతో హమీదుల్లాను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని ఓ సంచిలో కట్టి బాత్రూంలో పడేసింది. మృతదేహం రెండు వారాలుగా బాత్‌రూంలో ఉండిపోయింది. మృతదేహం కుళ్లిపోయిన తర్వాత ఇతర కీలక ఆధారాలు కొట్టుకుపోవడానికి బాత్‌రూంలో ఉద్దేశపూర్వకంగా ఉంచినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

హత్య తర్వాత హసీబా కోల్‌కతాకు పారిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఒక బృందాన్ని కోల్‌కతాకు పంపారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్య వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×