E-Paper
Advertisement

Bengaluru News: యువతి ఊపిరి తీసిన చెట్టు.. బెంగుళూరులో ఘటన, ఏం జరిగింది?

Bengaluru News: యువతి ఊపిరి తీసిన చెట్టు.. బెంగుళూరులో ఘటన, ఏం జరిగింది?
Advertisement

Bengaluru News: చెట్లు ఎంత అందాన్నిమాత్రమేకాదు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. వాటి వల్ల ముప్పు కూడా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ బెంగుళూరు సిటీలో జరిగిన ఘటన. చెట్టు పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోలదేనహళ్లి ప్రాంతంలో జరిగింది.

బెంగుళూరులో ఘోరం

Advertisement

బెంగుళూరు సిటీలోని సోలదేవనహళ్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు భారీ చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో 23 ఏళ్ల కీర్తన మృతి చెందింది. హెబ్బల్ నివాసి కీర్తన తన ఫ్రెండ్ రాధతో కలిసి సోలదేవనహళ్లిలోని ఆచార్య కళాశాలలో క్రికెట్ మ్యాచ్ చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. టూ వీలర్స్‌పై కీర్తన ఆమె ఫ్రెండ్ వస్తున్నారు.

ఆ సమయంలో సడన్‌గా చెట్టు కూలిపోయి వారి వాహనంపై పడి నుజ్జునుజ్జు అయ్యింది. మరో ద్విచక్ర వాహనదారుడు భాస్కర్ గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ముగ్గుర్నీ స్థానికులు-పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కీర్తన అక్కడికి తీసుకెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాధ, భాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

సడన్‌గా కూలిన చెట్టు, యువతి మృతి

ఏడాదిగా ఆ చెట్టు బలహీనంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఘటన సమయంలో ఎలాంటి గాలి వీయలేదు. ఈ ఘటనపై కీర్తన కుటుంబం నుండి ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బీబీఎంపీ అధికారులను అప్రమత్తం అయ్యారు. కూలిపోయిన చెట్టును నరికి తొలగించారు.

ALSO READ: సీజేఐపై దాడి యత్నాన్ని ఖండించిన పలువురు నేతలు

ఈ ఘటనతో రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. ఇటీవలకాలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గాలుల దాటికి చాలా చెట్లు బలహీనపడ్డాయి. వాటిని తొలగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. చెట్లు విరిగిపోయే ఘటనలు కేవలం బెంగుళూరుకి పరిమితం కాలేదు. ఆ మధ్య హైదరాబాద్, విశాఖ సిటీల్లో వర్షం- గాలులకు చెట్లు విరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. పొడవుగా పెరిగిన చెట్లపై అక్కడి కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×