E-Paper
Advertisement

Wineshops Close : మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు మద్యం షాపులు బంద్..

Wineshops Close : మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు మద్యం షాపులు బంద్..
Advertisement

Wineshops Close : జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరగనుంది. యావత్ దేశమంతా ఎదురుచూస్తోన్న ఈ వేడుకకు అయోధ్య నగరి ముస్తాబవుతోంది. రామయ్యకు దేశనలుమూలల నుంచి కానుకలొస్తున్నాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశప్రజలంతా ఆ రోజున ఇంట్లో దీపాలు వెలిగించి.. దీపావళిని జరుపుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఈ క్రమంలో జనవరి 22న అయోధ్య సహా.. ఉత్తరప్రదేశ్ మొత్తం మద్యంతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా డ్రై డేను ప్రకటించాయి.

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా రామమందిర ప్రారంభోత్సవం రోజున డ్రై డే ప్రకటించారు. జనవరి 22న రాష్ట్రంలో పబ్బులు, మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి అయోధ్యకు 300 మెట్రిక్ టన్నుల సువాసన గల బియ్యాన్ని పంపనున్నారు.

Advertisement

అస్సాం, జైపూర్ లలోనూ అక్కడి ప్రభుత్వాలు డ్రై డే ప్రకటించాయి. జైపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ ఏరియాల్లో జనవరి 22న మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. హెరిటేజ్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని స్థానిక బీజేపీ నాయకుడు గోపాల్ శర్మ డిమాండ్ చేయగా.. ఆ ప్రతిపాదనను మేయర్ మునేష్ గుజ్జర్ తిరస్కరించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×