E-Paper
Advertisement

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?
Advertisement

Lok Sabha Speaker: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది భారత చరిత్రలో ఇంతకుముందు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు. మోదీతోపాటు 71 మంది సభ్యుల మంత్రుల మండలి కూడా ప్రమాణం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు కేటాయించే శాఖలకు సంబంధించి ప్రకటన చేయనున్నారు. అయితే, లోక్ సభ స్పీకర్ పదవి విషంలో ప్రస్తుతం పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగిస్తారా లేక ఆయన స్థానంలో మరో నేతను కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ నెల 18 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. అయితే, జూన్ 20 నాటికి తదుపరి లోక్ సభ స్పీకర్ ను ఎంపిక చేస్తారంటూ పలు మీడియాల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జూన్ 22న సెషన్లో ప్రసంగించవచ్చు మరియు ప్రొటెం స్పీకర్ తో ప్రమాణం కూడా చేయిస్తారు.. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడికున్నిల్ సురేష్ కావొచ్చంటూ అందులో పేర్కొన్నారు.

Daggubati Purandeshwari
Daggubati Purandeshwari
Advertisement

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నదని, అయితే ఈ పదవి కోసం దగ్గుబాటి పురందేశ్వరి పోటీ పడుతున్నారంటూ కూడా మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు. ఆమె 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా మరియు 2012లో వాణజ్యం మరియు పరిశ్రమల మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆమెను లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం లేకపోలేదంటూ వార్తలు వస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×