E-Paper
Advertisement

ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానల హెచ్చరిక!

ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానల హెచ్చరిక!
Advertisement

IMD Orange Alert Northwest India:  దేశంలో Western Disturbances కారణంగా పలు ఉత్తర, వాయువ్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  హెచ్చ‌రించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5°C మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ మార్పులు ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయని అంచనా. ప్రధానంగా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వాతావరణ తీవ్రత అత్యధికంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఏప్రిల్ 3, 4, 7 తేదీల్లో భారీ వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే ప్రమాదం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏప్రిల్ 3 నుండి 5 వరకు వర్షాలు, పిడుగులతో కూడిన వాతావరణం ఉంటుంది.

Advertisement

ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్లు పడే అవకాశం ఉంది.ఏప్రిల్ 1 నుండి రాజస్థాన్‌లో వర్ష సూచన ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 4, 5 తేదీల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉంది.

ఈ అకాల వర్షాలు, వడగండ్ల వల్ల కోత దశలో ఉన్న గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తోటలను కాపాడుకోవడానికి వడగండ్ల వలలను వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు, గాలుల వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయాలు కలిగే అవకాశం ఉంది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Read Also: ప్రయాణికులకు షాక్.. 10 ఎక్స్ ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్ల రద్దు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×