E-Paper
Advertisement

బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ రీపోలింగ్.. బారులు తీరి ఓటేస్తున్న ప్రజలు

బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ రీపోలింగ్.. బారులు తీరి ఓటేస్తున్న ప్రజలు
Advertisement

West Bengal Re-Polling: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా రెండ్రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్రంలోని 15 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద శనివారం (మే 2) ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మెుదలు కాగా.. మరోమారు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

రీపోలింగ్ ఎక్కడంటే?

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో పరిధిలో గల మొత్తం 15 బూత్‌లలో ఈ రీపోలింగ్ జరుగుతోందియ. మగ్రాహత్ పశ్చిమ్ (Magrahat Paschim) నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్ (Diamond Harbour) అసెంబ్లీ సెగ్మెంట్ లో 4 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు మెుదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుండి వచ్చిన నివేదికలను పరిశీలించి.. ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

రీపోలింగ్‌కు ప్రధాన కారణం?

Advertisement

బెంగాల్లో ఏప్రిల్ 29వ జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో రిగ్గింగ్, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయం వంటి అక్రమాలు జరిగినట్లు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా మగ్రాహత్ పశ్చిమ్ నియోజకవర్గంలో ఓటర్ల చొక్కా జేబుల్లో స్పై కెమెరాలు ఉంచి వారు ఎవరికి ఓటు వేస్తున్నారో గమనిస్తున్నారని వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో క్షేత్రస్థాయిలో రిటర్నింగ్ అధికారుల చేత ఈసీ విచారణ జరిపించింది. అక్రమాలు జరిగాయంటూ నిర్ధారించుకున్న 15 బూత్ లలో ఎన్నికలు రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది.

బీజేపీ vs టీఎంసీ మాటల యుద్ధం

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ పరిధిలోనే ఈ రీపోలింగ్ బూత్ లు ఉన్నాయి. డైమండ్ హార్బర్ మగ్రాహాట్ లో భారీ తేడాతో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ.. తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ప్రజలు తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉందన్న ఆయన.. ఎన్ని సార్లు రీపోలింగ్ జరిపినా అది అలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్లో బీజేపీ సీఎం అభ్యర్థి సువేందు అధికారి.. టీఎంసీపై నిప్పులు చెరిగారు. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉండేందుకు అనేక బూతులలో అధికార పార్టీ ఆక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు.

Advertisement

Also Read: వేసవిలో మీ బెడ్ వేడిగా ఉంటుందా? ఈ బెడ్‌షీట్ ఉపయోగిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం

మే 4న ఎన్నికల ఫలితాలు..

ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రీపోలింగ్ తో పాటు గత రెండు దశల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ఫలితాలను మే 4న ఎన్నికల సంఘం వెల్లడించనుంది. కాగా, ఈ దఫా బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఏకంగా 92 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 6.81 కోట్ల ఓటర్లు ఉన్న బెంగాల్ రాష్ట్రంలో.. ఏప్రిల్ 23న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 93 శాతం, రెండో దశలో 91 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించింది. అయితే ఈసారి అధికారం చేపట్టే విషయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజారిటీ సర్వేలు బీజేపీపై మెుగ్గుచూపడం గమనార్హం.

Also Read: Brahmamudi Serial Today Episode May 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్మీ, చలపతిలను కలిసి నిజం చెప్పిన శృతి

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×