E-Paper
Advertisement

ఫస్ట్‌నైట్ రోజు ఎంత పని చేసింది.. భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్

ఫస్ట్‌నైట్ రోజు ఎంత పని చేసింది.. భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్
Advertisement

First Night Shock:  రోజులు మారాయి.. అడుగు వేసినా.. తీసినా డబ్బులు ఉండాల్సిందే. జీవితాంతం తోడుగా ఉంటానని భర్తతో ఏడడుగులు వేసింది భార్య. అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి ఆనందం కొన్ని గంటలపాటు నిలవలేదు. డబ్బు పిచ్చితో ఓ నవవధువు చేసిన వ్యవహారం అందరూ ముక్కున వేలు వేసుకునేలా చేసింది.

యూపీలో ఊహించని ఘటన.. వివాహం తర్వాత ఫస్ట్ నైట్ ఏం జరిగింది?

Advertisement

ఈ ఘటనకు సంబంధించి వరుడు సోదరుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని ఆగ్రా జిల్లాలో భయానక ఘటన బయటకు వచ్చింది. పోయిన ఏడాది ఏప్రిల్ 29న ఆగ్రాకు చెందిన ఓ యువకుడికి మరో యువతితో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత శోభనం కోసం కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.

ఆడపడుచులు వధూవరులను గదిలోకి పంపారు. వధువు తనపై ఉన్న మేలిముసుగు తీయడానికి ఏకంగా రూ.90 లక్షల నగదు కావాలని భార్య డిమాండ్ చేయడంతో వరుడు షాకయ్యాడు. ఏదో జోక్‌గా భార్య అన్నట్లు లైట్‌గా తీసుకున్నాడు. అంత మొత్తం ఇవ్వలేమని వరుడు తేల్చిచెప్పేశాడు.

Advertisement

భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్

తనకు శోభనం వద్దంటూ వివాహంలో పెట్టిన నగలు పట్టుకుని పుట్టింటికి వెళ్లింది వధువు. తొలి రాత్రి జరిగిన తతంగాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.  వరుడు కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తెచ్చాడు.  డబ్బు డిమాండ్‌తో మొదలైన ఈ వివాదం మరొక మలుపు తిరిగింది. అల్లుడి ఇంటిపై దాడులు చేశారు వధువు కుటుంబసభ్యులు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులకు దిగారు.

అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫ్యామిలీని సజీవ దహనం చేస్తామని హెచ్చరించారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత నెల మార్చి 26న వధువు కుటుంబసభ్యులు యువతి భర్త ఇంటికి వచ్చారు. మరి ఇరు కుటుంబాల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో వధువు తండ్రి, సోదరుడు అల్లుడి ఇంట్లోని గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు.

ALSO READ: ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై కనిపించిన మీరు.. మాకు న్యాయం చేస్తారా?.. హైకోర్టులో జ‌డ్జికి కేజ్రీవాల్ సవాల్

కుటుంబం మొత్తాన్ని మంటల్లో పడేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో వరుడితోపాటు అతడి తల్లిదండ్రులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. వధువు కుటుంబసభ్యుల ఒత్తిడితో పోలీసులు వరుడి ఫిర్యాదుపై స్పందించలేదు. బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆగ్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి మీడియాలో రకరకాల వార్తలు లేకపోలేదు. పెళ్లికూతురుకి ఆ పెళ్లిపై ఆసక్తి లేదని తేలింది. ఆర్థిక లాభం కోసమే ఓకే చేసిందని ఆరోపించారు ఆమె అత్తమామలు. తాము చేసిన ఫిర్యాదుకు పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు వరుడి ఫ్యామిలీ తెలిపింది. పెళ్లికూతురుతోపాటు ఆమె తల్లిదండ్రులు సహచరులపై కేసు నమోదైంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×