E-Paper
Advertisement

తమిళనాట విజయ్ ప్రభంజనం.. డ్రైవర్ కొడుకు అద్భుత విజయం

తమిళనాట విజయ్ ప్రభంజనం.. డ్రైవర్ కొడుకు అద్భుత విజయం
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు విజయ్ గట్టి పోటీనిచ్చారు. రెండేళ్ల క్రితం పార్టీ స్థాపించిన ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రజల మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన టీవీకే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఏర్పాటులో కీలక శక్తిగా అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా విజయ్ మేనియా కనిపిస్తోంది.

సామాన్యుడి గెలుపు..

Advertisement

ఈ ఎన్నికల్లో అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం విరుగంబాక్కం నియోజకవర్గ ఫలితం. ఇక్కడ విజయ్ తన కారు డ్రైవర్ కుమారుడు శభరినాథన్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని శభరినాథన్ నిలబెట్టుకున్నారు. డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై ఆయన ఘనవిజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడిని అసెంబ్లీకి పంపడం ద్వారా విజయ్ సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికే తమ మద్దతని ఓటర్లు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు.

టీవీకే జోరు మామూలుగా లేదు..!

Advertisement

తమిళనాడులో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ద్విముఖ రాజకీయాలకు విజయ్ ముగింపు పలికారు. క్షేత్రస్థాయిలో టీవీకే కార్యకర్తలు చేసిన కృషి.. విజయ్ పట్ల ఉన్న ప్రజాభిమానం పార్టీని విజయతీరాలకు చేర్చాయి. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. పాతతరం రాజకీయ నాయకుల కంటే మార్పు కోరుకునే కొత్త రక్తం వైపు ప్రజలు నిలిచారు. పారదర్శకమైన పాలన అందిస్తామన్న విజయ్ హామీని తమిళ ప్రజలు బలంగా నమ్మారు.

ప్రభుత్వ ఏర్పాటులో కీలకం.. 

ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ పార్టీ.. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. అవినీతి రహిత పాలన.. సంక్షేమ పథకాల అమలుపై విజయ్ పెట్టిన దృష్టి ఓటర్లను ఆకర్షించింది. తన సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్‌ను రాజకీయ బలంగా మార్చుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. తమిళనాడు గడ్డపై ఒక కొత్త శకం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: కేరళ రాజకీయాల్లో రేవంత్ సెగ.. విజయన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ ముగిసింది!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×