E-Paper
Advertisement

తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు.. గవర్నర్‌తో విజయ్ మరోసారి భేటీ, ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్

తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు.. గవర్నర్‌తో విజయ్ మరోసారి భేటీ, ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్
Advertisement

Chennai: తమిళనాట రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను ఆయన కోరారు. మావద్ద తగిన బ‌లం ఉందని, అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌కు తాము రెడీ అన్నట్లు తెలుస్తోంది.

తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు

Advertisement

తమిళనాడులో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. 2006లో మాదిరిగా ఈసారి ఓటర్లు ఏ పార్టీ తగినంత మెజార్టీ ఇవ్వలేదు. అప్పుడు డీఎంకెకు 96 సీట్లు ఇచ్చిన ఓటర్లు, ఈసారి విజయ్ పార్టీకి 108 సీట్లు ఇచ్చారు. కాకపోతే మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉండిపోయాడు.

గురువారం ఉదయం మరోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌తో సమావేశమయ్యారు టీవీకే చీఫ్ విజయ్. లోక్ భవన్‌కు వెళ్లిన విజయ్, ఎమ్మెల్యేల మద్దతు లేఖను మరోసారి గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.  శుక్రవారం లేదా శనివారం విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్

అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని, ఏకైక అతి పెద్ద పార్టీ కావడంతో మొదట అవకాశం ఇవ్వాలని  విజయ్ కోరినట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్‌ ఆహ్వానించడం, ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఓకే చేసినట్టు సమాచారం. ఉన్నట్లుండి గవర్నర్ నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు.

గురువారం ఉదయం డీఎంకె అధినేత స్టాలిక్ కీలక ప్రకటన చేశారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని, కొత్త ప్రభుత్వం ఏర్పాటులో డీఎంకే ఏ విధంగా అడ్డుపడదన్నారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం తాము ఏమాత్రం ఇష్టంలేదన్నారు. ప్రజల తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, అన్నాడీఎంకెతో కలిసి ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామన్న వదంతులను తోసిపుచ్చారు.

ALSO READ: తమిళ పాలిటిక్స్‌లో ‘రిసార్ట్’ రాజకీయం.. పుదుచ్చేరికి తరలిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు!

అంతకుముందు అన్నాడీఎంకే కూడా విజయ్ పార్టీకి తాము మద్దతు ఇచ్చేది లేదన్నారు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా రిసార్ట్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు బంతిని గవర్నర్ కోర్టులోకి నెట్టేశారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్‌కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ బల నిరూపణకు 118 ఎమ్మెల్యేల మద్ద తు అవసరం ఏర్పడింది.  టీవీకే పార్టీకి 108 సీట్లు రాగా,  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు.  మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం విజయ్ పార్టీకి ఏర్పడింది. మరి ఐదు సీట్ల విషయంలో ఏయే పార్టీలు మద్దతు ఇస్తాయో చూడాలి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×