E-Paper
Advertisement

మంచి జరుగుతుంది.. విజయం ఖాయం, టీవీకే చీఫ్ విజయ్ మెసేజ్

మంచి జరుగుతుంది..  విజయం ఖాయం, టీవీకే చీఫ్ విజయ్ మెసేజ్
Advertisement

Chennai:  తమిళనాడులో రాజకీయాల మాటేంటి? శుక్రవారం నాటికి సంబంధించి పరిణామాలు బయటకు రాలేదు. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ చేసిన మెసేజ్ ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. అంతా మంచి జరుగుతుందని, విజయం ఖాయమంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇంతకీ విజయం సందేశం ఏ సందర్భానికి సంబంధించినది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

టీవీకే చీఫ్ విజయ్ మెసేజ్‌పై తమిళనాట చర్చ

Advertisement

తమిళనాడులోని టీవీకే పార్టీ చీఫ్ విజయ్ శుక్రవారం ఓ సందేశం ఇచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విజయ్. అంతేకాదు ఫెయిలైన వారికి ధైర్యం చెబుతూ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

కట్టపడి శ్రమించి విజయాన్ని అందుకున్న తమ్ముళ్లు, చెల్లెళ్లకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజయం మీ కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు అని, ఉన్నత విద్య కోసం తదుపరి దశలోకి పూర్తి నమ్మకంతో అడుగు పెట్టాలని రాసుకొచ్చారు. పాసయినవారికి శుభాకాంక్షలు చెబుతూనే, ఫెయిలైన వారిని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

చివర్లో మంచి జరుగుతుంది.. విజయం ఖాయం-విజయ్

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారు నిరాశలో ఉండవద్దని, మళ్లీ ప్రయత్నించాలని పేర్కొన్నారు. మనం విజయానికి చాలా దగ్గరలో ఉన్నామని గుర్తుంచుకోండంటూ వారికి భరోసా ఇచ్చారు. చివరలో మంచి జరుగుతుంది..! విజయం తథ్యమంటూ ప్రస్తావించారు.

నటుడు, రాజకీయ నేత చెప్పిన ఈ మాటల్లో చివరి లైన్ విజయం అంచున ఉన్నాం అని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. చాలా మంది మద్దతుదారులు విద్యార్థుల భవిష్యత్ ఆశలకు దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారని అంటున్నారు. దీన్ని టీవీకే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి కొందరు.

ALSO READ: టీవీకే విజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

నటుడు, రాజకీయ నేత చెప్పిన ఈ మాటల్లో చివరి లైన్ విజయం అంచున ఉన్నాం అని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. చాలా మంది మద్దతుదారులు విద్యార్థుల భవిష్యత్ ఆశలకు దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారని అంటున్నారు. దీన్ని టీవీకే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి కొందరు.

విజయ్ మాటలు ఆ పార్టీ నేతలకే కాదు, యావత్త తమిళ ప్రజలకు సందేశం ఇచ్చారని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. అయితే సొంతంగా మెజారిటీ మార్కును దాటలేకపోయింది. ఆ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది అవసరం కాగా, ఆ పార్టీకి మరో ఐదు సీట్లు తగ్గాయి. చిన్నచిన్న రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతోంది, ఇంకా తగినంత మద్దతును కూడగట్టుకోలేదు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×