E-Paper
Advertisement

Veer Bal Diwas 2025:మతం మారేది లేదు.. మరణానికైనా సిద్ధమే! సిక్కు బాలల సింహ గర్జన

Veer Bal Diwas 2025:మతం మారేది లేదు.. మరణానికైనా సిద్ధమే!  సిక్కు బాలల సింహ గర్జన
Advertisement

Veer Bal Diwas 2025: పసి ప్రాయంలోనే మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్‌బలిదానం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. సిక్కుల పదో గురువు, గురు గోవింద్ సింగ్ గారిఇద్దరు చిన్న కుమారులు (ఛోటే సాహిబ్జాదే) చూపిన సాహసం, మన గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తుందిచరిత్ర పుటల్లో ఎన్నో త్యాగాలు లిఖించబడి ఉన్నాయి. కానీ వీరి బలిదానానికి  సాటి వచ్చే ఘట్టం మానవ చరిత్రలోనే మరొకటి కనిపించదు. కేవలం 7 , 9 ఏళ్ల ప్రాయం.. ఆటపాటలతో గడపాల్సిన ఆ పసి వయసులో, మరణం కళ్లముందు కనిపిస్తున్నా చెరగని చిరునవ్వుతో ధర్మాన్ని కాపాడిన ఆ వీర కిశోరాలే బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్. వీరి త్యాగాన్ని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’ గా ప్రకటించింది.

అచంచలమైన ధర్మనిష్ఠ:

Advertisement

1704వ సంవత్సరంలో సర్హింద్ నవాబు వజీర్ ఖాన్ ఈ చిన్నారులను బంధించి, తన దర్బారులో ప్రవేశపెట్టాడు. ముస్లిం మతంలోకి మారితే రాజభోగాలు, సంపద ఇస్తామని ఆశ చూపాడు. నిరాకరిస్తే కఠినమైన శిక్షలు తప్పవని బెదిరించాడు. కానీ.. ఆ చిన్నారులు ఏమాత్రం బెదరలేదు. “మా తాతగారు గురు తేగ్ బహదూర్ గారే ధర్మం కోసం ప్రాణాలర్పించారు. మేము కూడా అదే బాటలో నడుస్తాం తప్ప మతం మారంఅని సింహ గర్జన చేశారు.

గోడలో సజీవంగా.. కదిలించే బలిదానం:

Advertisement

పిల్లల మొండితనాన్ని చూసి ఆగ్రహించిన మొఘల్ పాలకులు, వారిని సజీవంగా గోడలో పెట్టి ఇటుకలతో కట్టాలని ఆదేశించారు. ఇటుకల గోడ మెడ వరకు వస్తున్నా.. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆ బాలురు ఏమాత్రం చలించలేదు. ధైర్యంగా తమ గురువులను స్మరిస్తూ. ధర్మ రక్షణ కోసం అమరులయ్యారు. అంతటి చిన్న వయసులో అపారమైన ధైర్యం, ధర్మం పట్ల అంకితభావం చూపడం ప్రపంచ చరిత్రలోనే అద్భుతం.

Also Read: ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి ఘన నివాళి.. మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం

దాచిపెట్టబడిన నిజమైన చరిత్ర:

దురదృష్టవశాత్తు..మన దేశాన్ని కాపాడటం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన ఇలాంటి వీరుల గాథలు దశాబ్దాల పాటు పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం పొందలేదు. విదేశీ ఆక్రమణదారుల చరిత్రకు ఇచ్చిన ప్రాధాన్యత, మన మట్టి వీరుల త్యాగాలకు దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ మరుగున పడ్డ సత్యాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ త్యాగాలు కేవలం సిక్కు మతానికి మాత్రమే పరిమితం కావు.. ఇవి భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకలు.

పిల్లల బలిదానం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది: “ఎంతటి ఆపద వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా.. సత్యాన్ని, ధర్మాన్ని వీడకూడదు.” నేటి తరం పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్ హీరోలు కాదు, ఇలాంటి నిజమైన వీర కిశోరాల చరిత్ర తెలియాలి. వీర్ బాల్ దివస్ సందర్భంగా ఆ చిన్నారుల సాహసానికి నివాళులు అర్పిస్తూ, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×