E-Paper
Advertisement

Keralam New Cm: కేసీ వేణుగోపాల్ కు షాక్.. కేరళం కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్, కాంగ్రెస్ పార్టీ ప్రకటన

Keralam New Cm: కేసీ వేణుగోపాల్ కు షాక్.. కేరళం కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్, కాంగ్రెస్ పార్టీ ప్రకటన
Advertisement

Keralam New Cm:  కేరళంకు కాబోయే కొత్త సీఎం ఎవరన్నది తేలిపోయింది. ముగ్గురు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్‌కు అదృష్టం వరించింది. రేపో మాపో ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.

కేరళం కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్

Advertisement

కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి పీఠం ఎవరిదన్న దానిపై ఉత్కంఠ, నెలకున్న ఊహాగానాలకు తెరదించింది కాంగ్రెస్ హైకమాండ్. వీడి సతీశన్‌ను కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది.

కేరళ ఏఐసీసీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షి, కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నుంచి ముగ్గురు సీనియర్లు పోటీ పడ్డారు. వారిలో వీడీ సతీసన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు 10 రోజులపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరదించింది కాంగ్రెస్ పార్టీ.

Advertisement

కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన.. కేసీ వేణుగోపాల్ కు షాక్

దశాబ్ద కాలంగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలో ఘన విజయం సాధించింది. పారావూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సతీశన్‌. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఆరుసార్లు విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి ఈటీ టైసన్‌పై 20 వేల 600 ఓట్ల తేడాతో సతీశన్ గెలిచారు.

2001 నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సతీసన్‌కు పార్టీలోనే కాకుండా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్-జోసెఫ్ వంటి కీలక మిత్రపక్షాల నుంచి మద్దతు లభించింది.  ముఖ్యమంత్రి రేసులో చివరి వరకు నిలిచారు కేసీ వేణుగోపాల్. అయితే కేరళ సీఎల్పీ లీడర్‌గా వీడి సతీషన్ పేరు ప్రకటించడంపై ఆయన స్పందించారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

ALSO READ: యూపీలో కలకలం.. మనిషి గాలిలో ఎగరడం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూడండి!

మే 4న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 140 స్థానాలకు గాను 102 స్థానాలను కైవసం చేసుకుంది. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది.  తదుపరి కేరళ ముఖ్యమంత్రి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేరళ కాంగ్రెస్ రెడీ అయ్యింది.

గురువారం సాయంత్రం గవర్నర్‌తో కాంగ్రెస్ సీఎల్పీ నే వీడీ సతీశన్ సమావేశం కానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. శుక్రవారం లేకుంటే శనివారం కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×