E-Paper
Advertisement

Gyanvapi : జ్ఞానవాపి ఒక్కటే కాదు.. మరో 5 బావులున్నాయ్!

Gyanvapi : జ్ఞానవాపి ఒక్కటే కాదు.. మరో 5 బావులున్నాయ్!
Advertisement
Gyanvapi

Gyanvapi : హిందీలో వాపి అంటే.. బావి. జ్ఞానవాపి జ్ఞానం నిరంతరం ఊరే బావి అని అర్థం. లింగపురాణం ప్రకారం.. గంగానది కంటే ముందే జ్ఞానవాపి ఉంది. భూమ్మీద నీరు అనేది లేని రోజుల్లో పరమశివుడు తన త్రిశూలంతో నేలను తవ్వగా వచ్చిన ప్రదేశమే ఈ జ్ఞానవాపి. ఇక్కడే పరమశివుడు… పార్వతికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకే దీనికి జ్ఞాన్‌వాపి అని పేరు వచ్చింది. ఎక్కడ నుండి నీరు వస్తుందో ఆ స్థానాన్ని జ్ఞానవాపి కుండం అని పిలుస్తారు. అదే నేటి ఆలయంలోని బావి అని హిందువుల వాదన.

లింగపురాణం పురాణం ప్రకారం.. కాశీలో మొత్తం 6 జలాశయాలు(వాపిలు) ఉన్నాయి. అవి..

Advertisement

1) జేష్ట వాపి. ఇది ఇప్పుడు కనుమరుగైంది.

2) కాశీ విశ్వనాథ ఆలయానికి ఉత్తరాన ఉన్న జ్ఞానవాపి.

Advertisement

3) కర్కోటక వాపి. దీనినే ఇప్పుడు నాగ కువా అని పిలుస్తున్నారు.

4) భద్ర వాపి. ఇది భద్రకూప ప్రాంతంలో ఉంది.

5) శంఖ చూడ వాపి. ఇది కనుమరుగైపోయింది.

6) సిద్ధవాపి. ఇది నేటి బాబూ బజార్‌లో నేటికీ ఉంది.

“దేవస్య దక్షిణ వాపి తిష్టి…తసీయాత్ వోద్కం పీత్వా పునర్జన్మ న విద్యతే.” ( ప్రాచీన విశ్వవేశ్వర ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్న వాపి నీటిని సేవించడం ద్వారా జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది) అని లింగపురాణంలో దీని ప్రస్తావన ఉంది.

ఇదీ చదవండీ : గర్జిస్తున్న గతాన్ని ఇలా అధిగమిద్దామా..

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×