E-Paper
Advertisement

JD Vance India Visit: ఫ్యామిలీలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు, మోదీతో జేడీ వాన్స్ భేటీ

JD Vance India Visit: ఫ్యామిలీలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు, మోదీతో  జేడీ వాన్స్ భేటీ
Advertisement

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతోపాటు భార్య ఉషా వాన్స్ కూడా వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన సమావేశం కానున్నారు. అమెరికా-భారత్ లకు సంబంధించి వాణిజ్యం,ప్రాంతీయ భద్రత, పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే ఫస్ట్ టైమ్. వాన్స్ వెంట భార్య, ముగ్గురు పిల్లలు ఆ దేశ ప్రతినిధులు ఉన్నారు. అందులో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. ఎయిర్‌పోర్టులో వాన్స్‌కు సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి.

Advertisement

జేడీ వాన్స్ టూర్ షెడ్యూల్

సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వాన్స్‌ దంపతులకు తన నివాసంలో ప్రధాని స్వాగతం పలుకుతారు. ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. విందు తర్వాత రాత్రికి వాన్స్‌ దంపతులు జైపూర్ వెళ్లనున్నారు.

Advertisement

ఢిల్లీ టు జైపూర్

విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం అక్కడ పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది వాన్స్ ఫ్యామిలీ. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆయన ప్రసంగిస్తారు. ట్రంప్‌ హయాంలో భారత్-అమెరికా సంబంధాల గురించి మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, ఇండియా అధికారులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు.

ALSO READ: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోలు హతం

జైపూర్ టు అమెరికా

23న వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్‌‌మహల్‌, శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ జైపూర్‌కు వెళ్తారు. 24న అక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్లనున్నారు. ప్రధాని మోదీ-అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. భేటీ తర్వాత వాన్స్‌ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.

భారత్‌ నుంచి వెళ్లిన విద్యార్థుల అంశంపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఉషా వాన్స్ పూర్వీకులు సొంతూరు విజయవాడ. ఈ టూర్ లో ఆమె కచ్చితంగా విజయవాడకు వస్తారని చాలామంది భావించారు. కాకపోతే షెడ్యూల్ ముందుగా ఫిక్స్ కావడం రాలేకపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×