E-Paper
Advertisement

UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్.. ఇకపై అలాంటి పప్పులు ఉండకవ్, తేడా చేస్తే బుక్కవుతారు

UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్.. ఇకపై అలాంటి పప్పులు ఉండకవ్, తేడా చేస్తే బుక్కవుతారు
Advertisement

UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎగ్జామ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మొదలుపెట్టేసింది. తాజాగా యూపీఎస్సీ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి ఫేస్ అథెంటికేషన్ నిర్వహించనుంది. 

Advertisement

యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్ అప్లై

Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రకరకాల నియామక పరీక్షలను నిర్వహిస్తోంది యూపీఎస్సీ. అందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్IAS, ఇండియన్ ఫారిన్ సర్వీస్IFS, ఇండియన్ పోలీస్ సర్వీస్IPS కోసం అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరీక్ష నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్‌ని తప్పని సరి చేసింది.

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ-ఎన్‌డీఏ, నావల్ అకాడమీ-ఎన్ఏ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-సీడీఎస్ వంటి పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. అది విజయవంతం అయ్యింది.

అలాంటి పప్పులు ఉండకవ్,  తేడా చేస్తే అభ్యర్థులు బుక్కవుతారు

గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ముఖాలను డిజిటల్‌గా స్కాన్ చేసి, వారి దరఖాస్తు ఫారాల్లోని ఫొటోలతో సరి పోల్చింది. ధృవీకరణ సమయాన్ని అభ్యర్థికి సగటున 8 నుండి 10 సెకన్లకు తగ్గించిందనట్టు పేర్కొంది. అదనపు భద్రతా జోడిస్తూ ప్రవేశ ప్రక్రియను గణనీయంగా క్రమబద్ధీకరించిందని యూపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.

కేంద్ర సర్వీసుల ఉద్యోగాలకు సంబంధించి ప్రతీ ఏటా 14 పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఆ పరీక్షల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు. చాలామంది అభ్యర్థులు ఒకరికి బదలు మరొకరు పరీక్షలు రాసిన ఘటన కనిపిస్తున్న సందర్భం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ALSO READ:  సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు..  త్రిశూలంతో ప్రధాని మోదీ

ఆధార్ ధ్రువీకరణ, అభ్యర్థులకు ముఖ గుర్తింపు, క్యూఆర్ కోడ్ స్కానింగ్, సీసీటీవీల వంటి వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది. ఎగ్జామ సెంటర్ వద్ద వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఎంట్రీ పాయింట్ వద్ద కెమెరాతో ఫేస్ అథెంటికేషన్ పరిశీలిస్తారు. లైవ్ ఇమేజ్ రిజిస్ట్రేషన్ ఫోటోగ్రాఫ్‌తో సరిపోల్చి చూస్తారు.

ఓకే అయితే అభ్యర్థి పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు అధికారులు. యూపీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో ఇతర పరీక్షా బోర్డులకు కేంద్ర బిందువుగా మారవచ్చని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×