E-Paper
Advertisement

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

UP Minor Girl:  ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!
Advertisement

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు కొంత మంది చేస్తున్న తలతిక్క ప్రయత్నాలు చివరికి ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నాయి. కొంత మంది డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండగా, మరికొంత మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కేసులపాలవుతున్నారు. తాజాగా ఓ టీనేజర్ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆ అమ్మాయితో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

యూపీకి చెందిన ఓ టీనేజర్ అక్టోబర్ 27న ఓ వీడియోను షేర్ చేసింది. సుమారు ఒక నిమిషం డ్యూరేషన్ ఉన్న ఈ వీడియోలో సదరు అమ్మాయి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్లిప్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు అమ్మాయితో పాటు ఆమె తల్లింద్రుడులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశారు. పలువురు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

డిటెన్షన్ హౌస్ కు బాలిక, తల్లిదండ్రులు అరెస్ట్

Advertisement

సదరు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలకు దిగారు. సదరు బాలికను అదుపులోకి తీసుకొని డిటెన్షన్ హోమ్‌కు పంపారు. ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అభ్యంతరకరమైన వీడియోను తన కూతురు సోషల్ మీడియాలో పెట్టిందనే విషయం తెలిసినా, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడంతో వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. అటు ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. “మైనర్ బాలిక హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసు. మరికొందరు కూడా ఇందులో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్స్ ను పెంచుకోవాలని ఆ అమ్మాయి కోరుకుంది. మేము ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసాము. ఈ వీడియోను వైరల్ చేయవద్దని మేం ప్రజలను కోరుతున్నాను. ఈ వీడియోను షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని పోలీసులు తెలిపారు.

క్షమాపణలు చెప్పిన మైనర్ బాలిక

సదరు బాలిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పలువురు తీవ్ర విమర్శలు చేయడంతో ఆ అమ్మాయి క్షమాపణలు చెప్తూ మరో వీడియోను షేర్ చేసింది. “నేను ఆ వీడియో చేయడం ద్వారా తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను మళ్ళీ అలాంటి తప్పు చేయను. ఈ వీడియోను వైరల్ చేయవద్దని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను” అని ఆమె రిక్వెస్ట్ చేసింది.

Advertisement

Read Also: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×