E-Paper
Advertisement

తక్షశిలకు పాక్ తూట్లు.. ‘వారసత్వ హోదా’ ఊడుతుందా? యునెస్కో సీరియస్ వార్నింగ్!

తక్షశిలకు పాక్ తూట్లు.. ‘వారసత్వ హోదా’ ఊడుతుందా? యునెస్కో సీరియస్ వార్నింగ్!
Advertisement

Taxila Heritage: ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO).. పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. అక్కడ ఉన్న ప్రముఖ పురాతన బౌద్ధ క్షేత్రం, చారిత్రక నగరమైన తక్షశిల (Taxila) ప్రపంచ వారసత్వ హోదాకు సంబంధించి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తక్షశిలలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ‘పునర్నిర్మాణ’ పనులను వెంటనే నిలిపివేసి.. పాత స్థితికి తీసుకురాకపోతే ప్రపంచ వారసత్వ జాబితా నుండి తొలగిస్తామని పాకిస్థాన్ కు ఐరాస లేఖ రాసింది.

పురాతనమైన తక్షశిల ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అంతర్జాతీయ నిబంధనలను పురాతన కట్టడాల పరిరక్షణ సూత్రాలను పక్కనబెట్టి.. ఆధునిక సిమెంట్‌, ఇటుకలతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంపై యునెస్కో నిపుణుల బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పనుల వల్ల కట్టడం.. అసలైన చారిత్రక విలువ, ప్రాచీనత దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షశిల ఔన్నత్యం దెబ్బతినేలా ఉన్న పునర్నిర్మాణాలను వెంటనే తొలగించాలని.. లేదంటే ప్రపంచ వారసత్వ హోదాను తొలగిస్తామని హెచ్చరించింది.

Advertisement

ఇటీవల జర్మనీలోని ఓ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని తమ జాబితా నుండి యూనెస్కో తొలగించింది. అక్కడి ప్రభుత్వం అనవసరమైన జోక్యాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ తక్షశిల విషయంలోనూ ఏమాత్రం వెనుకాడబోమని.. యూనెస్కో అధికారులు తాజాగా రాసిన లేఖలో తేల్చి చెప్పినట్లు ఆ దేశ ప్రముఖ పత్రిక డాన్ ఓ కథనాన్ని ప్రచురించింది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా పాక్.. పునర్నిర్మాణాలను తొలగిస్తుందని ఆశిస్తున్నట్లు  యూనిస్కో వర్గాలు పేర్కొన్నట్లు రాసుకోచ్చింది.

Also Read: జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల్లో భారీ మార్పులు.. బోర్డు మార్కులకు 50% వెయిటేజీ?

Advertisement

పాకిస్థాన్ లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షశిల క్రీస్తు పూర్వం నుంచి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధ విద్యా కేంద్రంగా, బౌద్ధ సంస్కృతికి నిలయంగా విలసిల్లింది. ఒకప్పటి అఖండ భారత దేశంలో తక్షశిల ఓ వెలుగు వెలిగింది. అయితే దేశ విభజన తర్వాత తక్షశిల ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. అయితే 1980లోనే దీనికి ప్రపంచ వారసత్వ హోదాను ఇచ్చి యూనెస్కో గౌరవించింది. అయితే సరైన ప్రణాళిక లేకుండా నిపుణుల పర్యవేక్షణ లేకుండా స్థానిక అధికారులు చేసిన మార్పులు ఈ చారిత్రక సంపదను కలుషితం చేసేలా ఉన్నాయని ఐరాస నివేదిక పేర్కొంది. ‘పురాతన కట్టడాలను సంరక్షించాలి కానీ, వాటి రూపరేఖలను మార్చేలా కొత్తగా నిర్మించకూడదు’ తాజాగా పాక్ ను హెచ్చరించింది.

Also Read: నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×