E-Paper
Advertisement

FlyOver Collapse: కూలిన ఫ్లై ఓవర్.. స్పాట్ లో 60 మంది ?

FlyOver Collapse: కూలిన ఫ్లై ఓవర్.. స్పాట్ లో 60 మంది ?
Advertisement

FlyOver Collapsed in Tamilnadu: తమిళనాడులో తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూలిపోయింది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. శిథిలాల కింద వందమందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు.

నిన్న రాత్రి ప్రమాదం జరగగా.. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడిన 22 మందిని రెస్క్యూ టీం కాపాడగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. ఊహించని రీతిలో విషాద ఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫ్లై ఓవర్ వద్ద ప్రతిరోజూ సుమారుగా 200 మంది కూలీలు పనిచేస్తారని తెలుస్తోంది. వారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని స్థానికులు తెలిపారు. ఫ్లై ఓవర్ కు ఒక వైపున నిర్మించిన ఇనుప నిర్మాణం 20 మీటర్ల దూరంలో కూలింది.

Advertisement

Also Read: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలడానికి గల కారణాలేంటి ? నాసిరకపు నిర్మాణాలు చేపట్టారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

రైల్వే స్టేషన్ లో మంటలు

విశాఖ లోని సింహాచలం రైల్వే స్టేషన్ లో మంటలు చెలరేగాయి. బెంగుళూర్ గౌహతి ఎక్సప్రెస్ లోని S7 బోగీలో మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో జనం బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పొగను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత రైలు యధావిధిగా గౌహతి వైపు ప్రయాణం కొనసాగించింది. బ్రేక్ వేసిన సమయంలో మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×