E-Paper
Advertisement

Two Farmers were killed by Elephant: విషాదం.. మహిళా రైతుతోపాటు మరొకరిని చంపేసిన ఏనుగు?

Two Farmers were killed by Elephant: విషాదం.. మహిళా రైతుతోపాటు మరొకరిని చంపేసిన ఏనుగు?
Advertisement

Two Farmers were killed by Elephant: ఇటీవల తెలంగాణలోని కుమురం భీం జిల్లాకు చెందిన ఇద్దరు రైతులపై దాడి చేసి చంపేసిన ఏనుగు మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు రైతులను కూడా పొట్టనబెట్టుకుంది. ఇటీవల కుమురం జిల్లాలో ఏనుగు భయానక వాతావరణం సృష్టించి మహారాష్ట్ర బాట పట్టిన విషయం తెలిసింది. అయితే, మహారాష్ట్రలో కూడా మరో ఇద్దరు రైతులపై దాడి చేసి వారిని కూడా బలి తీసుకుంది.

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ కియర్ గ్రామ శివారులోని పంట చేనులో పనులు చేస్తున్న గిరిజన రైతుపై దాడి హతమార్చిందని.. అక్కడి నుంచి హద్దురు గ్రామానికి వెళ్లి అక్కడ చేనులో పనులు చేసుకుంటున్న మహిళా రైతుపై దాడి చేయగా.. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం.దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే, ఇదే ఏనుగు ప్రాణహిత నది దాటి కుమురం భీం జిల్లాలో భయానక వాతావరణం సృష్టించింది. పంట పొలాల్లో పని చేస్తున్న ఇద్దరు రైతులపై దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. అయితే, ఇదే ఏనుగు మహారాష్ట్రలో కూడా మరో ఇద్దరిపై దాడి చేసి హత్య చేయడంతో మహారాష్ట్రకు చుట్టుపక్కల ఉన్న తెలంగాణ గ్రామాల్లో అధికారులు దండోరా వేయించినట్లుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు, రైతులకు సూచించినట్లుగా సమాచారం.

Also Read:ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×