E-Paper
Advertisement

Maharashtra : మహా ట్విస్టులు.. శిండేకు షాక్..? త్వరలో అజిత్ పవార్ కు సీఎం పగ్గాలు..?

Maharashtra : మహా ట్విస్టులు.. శిండేకు షాక్..? త్వరలో అజిత్ పవార్ కు సీఎం పగ్గాలు..?
Advertisement

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సీఎంను మారుస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ అసలు వ్యూహం ఇదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 16 మంది శిండే వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగస్ట్ 11 లోగా నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో శిండేను తప్పించి అజిత్‌కు పగ్గాలు అప్పగించాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఉద్ధవ్‌ ఠాక్రే పత్రిక సామ్నా ప్రచురించిన సంపాదకీయం రాజకీయ అలజడి రేపింది. త్వరలోనే అజిత్‌ పవార్‌ సీఎం పీఠంపై కూర్చుంటారని ఆ పత్రిక పేర్కొంది. ఏడాది కిందట శివసేనను చీల్చి బయటకు వచ్చిన 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల నేతృత్వంలోని బీజేపీ దేశంలోని రాజకీయాలను బురదమయం చేసిందని విమర్శించింది.

Advertisement

సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఖండించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో అసలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడదని స్పష్టం చేసింది. ఒకవేళ వ్యతిరేక నిర్ణయం వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పింది.

మహారాష్ట్రలో ఉన్న 48 లోక్‌సభ సీట్లలో 45 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ శిండే నాయకత్వంలో ఇలాంటి విజయం సాధ్యంకాదని కాషాయ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. మరాఠా నాయకుడిగా శిండే కంటే అజిత్‌ పవార్ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపగలరని నమ్ముతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

రాజ్‌భవన్‌కు సమర్పించిన లేఖ ప్రకారం అజిత్‌ పవార్‌కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ అంటోంది. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 145 మంది మద్దతు అవసరం. ఆ బలం ఉందని బీజేపీ చెబుతోంది. అప్పుడు శిండే వర్గ ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×