E-Paper
Advertisement

విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. మద్ధతు వెనక్కి తీసుకున్న IUML, టెన్షన్‌లో దళపతి

విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. మద్ధతు వెనక్కి తీసుకున్న IUML, టెన్షన్‌లో దళపతి
Advertisement

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలుత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంతో విజయ్ కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు మద్దతు ప్రకటించిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) నుంచి ఇప్పటి వరకు గవర్నర్‌కు అధికారికంగా ఎటువంటి మద్దతు లేఖ అందలేదు.

ఈ తాజా రాజకీయ పరిణామాల వల్ల టీవీకే కూటమి సంఖ్యా బలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ మరో రెండు సీట్ల దూరంలో నిలిచిపోయారు. సంఖ్యా బలంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ హైడ్రామా మొదలైంది. విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ సంఖ్యా బలం సరిగ్గా లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పటి వరకు అధికారికంగా ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.

Advertisement

ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా మారింది. మద్దతు ఇస్తామని చెప్పిన పార్టీలు వెనక్కి తగ్గడం లేదా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్ క్యాంపులో ఆందోళన మొదలైంది. గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రానున్న కొన్ని గంటల్లో విజయ్ ఏ విధంగా పావులు కదుపుతారో అన్నది ఉత్కంఠగా మారింది.

Read Also: TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×