E-Paper
Advertisement

Tamil Nadu: టీవీకే విజయ్‌కి సీఎం కుర్చీ ఆఫర్.. 50 శాతం సీట్లు, అయినా తగ్గేదేలే అని చెప్పిన దళపతి..!

Tamil Nadu: టీవీకే విజయ్‌కి సీఎం కుర్చీ ఆఫర్.. 50 శాతం సీట్లు, అయినా తగ్గేదేలే అని చెప్పిన దళపతి..!
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న ఈ పార్టీ చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్‌కు ఒక ప్రముఖ జాతీయ పార్టీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున వెల్లడించడం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి పదవితో పాటు 50 శాతం అసెంబ్లీ సీట్లను కేటాయిస్తామని సదరు పార్టీ ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విజయ్ సున్నితంగా తిరస్కరించారని స్పష్టం చేశారు.

ఆధవ్ అర్జున సదరు పార్టీ పేరును మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. అయితే విజయ్ ఢిల్లీకి లొంగిపోయే వ్యక్తి కాదని వ్యాఖ్యానించడం ద్వారా అది బీజేపీయేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఉద్దేశం విజయ్‌కు లేదని అర్జున వివరించారు. అధికార దాహం కన్నా ప్రజల నమ్మకమే ముఖ్యమని తన నాయకుడు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. పొత్తుల కోసం సదరు పార్టీ 50 నుంచి 90 సీట్ల వరకు ఆఫర్ ఇచ్చిందని అయినా విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపారని తెలిపారు.

Advertisement

మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సైతం విజయ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని 55 స్థానాలు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఎన్డీయేలోని ఇతర మిత్రపక్షాలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీవీకేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిసామి ఇప్పటికే స్పష్టం చేశారు. విజయ్ కూటమిలోకి వస్తే తమ ప్రాధాన్యత తగ్గుతుందని అన్నాడీఎంకే ఆందోళన చెందుతోంది.

తమిళనాడులో డీఎంకే బలాన్ని తగ్గించాలంటే బలమైన కూటమి అవసరమని బీజేపీ భావిస్తోంది. సినీ గ్లామర్ ఉన్న విజయ్ తోడైతే స్టాలిన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడవచ్చని కమలనాథుల వ్యూహం. ఇందుకోసం అన్నాడీఎంకేలోని విభేదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం విజయ్ తన సైద్ధాంతిక వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా డీఎంకేను రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం తమిళనాడు రాజకీయ  పోరులో ఎవరు నెగ్గుతారో…..

Advertisement

Also Read: Minister Thummala: ఉగాది కానుకగా.. రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×