E-Paper
Advertisement

TVK Vijay: అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లుతారు.. వేలూర్ సభా వేదికపై విజయ్ భావోద్వేగం

TVK Vijay: అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లుతారు.. వేలూర్ సభా వేదికపై విజయ్ భావోద్వేగం
Advertisement

TVK Vijay:  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, దురాక్రమణలు, నేరాలను అరికట్టడంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తనను, తన పార్టీని అధికార పక్షం టార్గెట్ చేస్తోందని విజయ్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే శాసనసభ ఎన్నికల ముఖచిత్రాన్ని వివరిస్తూ.. ఈ పోరు ప్రధానంగా టీవీకే, డీఎంకే పార్టీల మధ్యే ఉంటుందని విజయ్ అంచనా వేశారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పినట్లుగానే తన రాజకీయ పంథాలో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటించారు. దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న భారతీయ జనతా పార్టీ తమ సిద్ధాంత శత్రువు కాగా.. రాష్ట్రంలో కుటుంబ పాలన.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన డీఎంకే తమ ప్రధాన రాజకీయ శత్రువు అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు.

Advertisement

ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల తప్పిదాలను వేలెత్తి చూపడం పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా తన బాధ్యత అని విజయ్ పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి తనను భయపెట్టాలని చూడటం అవివేకమని హితవు పలికారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని.. డీఎంకేకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదగడం ఖాయమని తన అనుచరుల్లో ఉత్సాహం నింపారు.

ప్రస్తుత ప్రభుత్వం పాలన కంటే ప్రచారంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని విజయ్ విమర్శించారు. సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆక్షేపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం చెందడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని.. ఇందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని విజయ్ ఉద్ఘాటించారు. తమిళ ప్రజల సంక్షేమమే పరమావధిగా టీవీకే ముందుకు సాగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Janasena: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్.. జనసేన బలోపేతం దిశగా మరో అడుగు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×