E-Paper
Advertisement

కన్నీళ్లు, కేరింతలు.. టీవీకే చీఫ్ విజయ్ ఇంట్లో సంబరాలు… వీడియో వైరల్

కన్నీళ్లు, కేరింతలు.. టీవీకే చీఫ్ విజయ్ ఇంట్లో సంబరాలు… వీడియో వైరల్
Advertisement

TVK Vijay Home Celebrations: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే చీఫ్ విజయ్ చరిత్ర సృష్టించారు. నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అందనంత ఎత్తులో విజయానికి దగ్గర్లో ఉన్నారు. దశాబ్దాలుగా తెరపై ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన విజయ్.. తొలి ఎన్నికల ఫలితాల్లో బ్లాక్‌బస్టర్‌ను అందించే దిశగా సాగుతున్నారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను 107 స్థానాల్లో విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఆధిక్యంలో దూసుకుపోతుంది. డీఎంకే 66 స్థానాలు, ఏఐఏడీఎంకే 61 స్థానాలలో లీడ్ లో కొనసాగుతోంది.

విజయ్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

టీవీకే ఆధిక్యంలో దూసుకుపోతుండడంతో.. విజయ్ ఇంటికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ట్రెండ్‌లు బయటకు రాగానే విజయ్ నివాసంలో సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, విజయ్ తండ్రితో పాటు అతని కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ, ఉత్సాహంతో గంతులు వేస్తూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ఆనంద భాష్పాలతో టీవీకే విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. విజయ్ ఇంటి వద్ద పోలీస్ ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో విజయ్ ఇంటికి చేరుకుంటుండడంతో.. భద్రత కట్టుదిట్టం చేశారు.

Advertisement

ఏఐఏడీఎంకేతో పొత్తు

టీవీకే ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. మెజారిటీ మార్క్ కోసం ఏఐఏడీఎంకే సాయం కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు పొత్తుకు ఫుల్ స్టాప్ పెట్టాయి. అయితే ఫలితాల తర్వాత మళ్లీ పొత్తుపై చర్చలు జరగవచ్చని సమాచారం. టీవీకేకి చెందిన ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ, “మేము గెలుస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. ఫలితాల పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు ఏఐఏడీఎంకే, డీఎంకేలతో విసిగిపోయారు.” అన్నారు.

తమిళనాట సినీ రాజకీయం

Advertisement

సినీ నటులు రాజకీయాల్లో రాణించడం తమిళనాడుకు కొత్తేమీ కాదు. ఎం.జి. రామచంద్రన్, జయలలిత రాజకీయ జీవితాలు సినీరంగం నుంచే ప్రారంభం అయ్యాయి. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం కాస్త భిన్నంగా జరిగింది. ఆయన ఏ జాతీయ పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి స్థాపించలేదు. ద్రవిడ సిద్ధాంతాలతో పుట్టిన, దశాబ్దాల తరబడి మద్దతు ఉన్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొంటున్న పార్టీగానే ఆయన ప్రచారం చేశారు. విజయ్‌ రాజకీయ ప్రవేశంలో అనేక ఒడిదుడుకులు చూశారు. కరూర్ తొక్కిసలాట వివాదం, ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల వివాదాలు, విడుదలకు ముందే పైరసీ ప్రింట్ రావడం.. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×