E-Paper
Advertisement

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు-కార్లు, మృతుల సంఖ్య భారీగా

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు-కార్లు, మృతుల సంఖ్య భారీగా
Advertisement

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌  హైవేపై ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ.. తెల్లవారుజామున నాలుగు బస్సులకు మంటలకు అంటుకున్నాయి.  ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం

Advertisement

మంగళవారం ఉదయం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఏం జరిగిందో తెలీదు. నాలుగు ట్రావెల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి.సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కనీసం నాలుగు బస్సులు మంటల్లో కాలిపోయాయని ఆ వ్యక్తి చెప్పినట్టు ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

Advertisement

మంటల్లో ట్రావెల్ బస్సులు, మృతుల సంఖ్యపై

ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేసే ప్రయత్నం చేశాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అసలు అక్కడ ఏం జరిగిందో కనిపించడం కష్టంగా మారింది.మంటలు త్వరగా వ్యాపించడంతో ప్రజలు ఆ ప్రాంతం నుంచి భయంతో పరిగెడుతూ కనిపించారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది. దట్టమైన పొగమంచు కారణంగా అనేక బస్సులు ఒకదానికి మరొకటి ఢీ కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కనీసం నలుగురు మరణించగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడు బస్సులు-మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. బల్దేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మైల్‌స్టోన్ 127 సమీపంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ALSO READ: ప్రమాదకరస్థాయిలో పొగమంచు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలు

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×