E-Paper
Advertisement

Fire accident in Train: టూరిస్ట్ ట్రైన్‌లో మంటలు.. 10మంది దుర్మరణం.. ఏంటి కారణం?

Fire accident in Train: టూరిస్ట్ ట్రైన్‌లో మంటలు.. 10మంది దుర్మరణం.. ఏంటి కారణం?
Advertisement
Tamil nadu train accident today

Tamil nadu train accident today(Breaking news of today in India):

మదురై రైల్వే స్టేషను‌ ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బోగీలో టీ తయారు చేస్తుండగా సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ సిలిండర్‌ను ప్రయాణికుడొకరు రహస్యంగా తెచ్చినట్టు సమాచారం. రామేశ్వరం నుండి కన్యాకుమారి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ‍ప్రమాదంలో 10 మంది మృతి చెందగా..మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంటున్నారు. టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్‌ పేలి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ప్రమాదంపై రైల్వేశాఖ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. రైలు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూరిస్ట్‌ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. ఈ రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ టూరిస్ట్‌ రైలు తమిళనాడులోని మధురైకి శనివారం ఉదయం 5.15 గంటలకు చేరుకుంది. మధురై రైల్వే స్టేషన్ సమీపంకు రాగానే ప్రైవేటు పార్టీ కోచ్‌లో సిలిండర్‌ పేలింది. దాంతో ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు మరింత ఉదృతమయ్యాయి. దాంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని కేకలు వేశారు. కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై రైలు కింది ప్రాణాలు కాపాడుకున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×