E-Paper
Advertisement

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి
Advertisement

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో బండరాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులను ఢీకొట్టాయి. హిమాలయ దేవాలయానికి మోటారు సైకిల్‌పై వెళ్లిన పర్యాటకులను బండరాళ్లు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. మృతులు నిర్మల్ షాహి(36), సత్య నారాయణ(50)లుగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి అక్కడి అధికారులు మృతదేహాలను వెలికితీయించారు.

Advertisement

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం అమర్ నాథ్, చార్ ధమ్ యాత్ర కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ యాత్రలకు తెలంగాణ నుంచి కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకొని బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కొండచరియలు విరిగి వీరి బైక్ పై పడ్డాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×