E-Paper
Advertisement

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్‌కు గవర్నర్ షాక్.. మ్యాజిక్ నంబర్ ఎక్కడ?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్‌కు గవర్నర్ షాక్.. మ్యాజిక్ నంబర్ ఎక్కడ?
Advertisement

Vijay TVK: తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో విజయ్ ఈ ప్రతిపాదనను గవర్నర్ ముందు ఉంచారు. అయితే విజయ్ సమర్పించిన సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ‘మ్యాజిక్ నంబర్’ మీ దగ్గర లేదు కదా అని విజయ్‌ను గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే సొంతంగా 107 స్థానాల్లో విజయం సాధించగా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తోడవ్వడంతో ఆ పార్టీ బలం 112కి చేరింది. మెజారిటీ మార్కును అందుకోవడానికి విజయ్‌కు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. ఈ ఆరుగురి బలం లేకపోవడంతోనే గవర్నర్ టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణ అనుమతి ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇతర పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తాము టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని ఆయా పార్టీలు ప్రకటించాయి. ప్రస్తుతం తమిళనాడులో సీపీఐకి 2.. సీపీఎంకి 2.. ఐయూఎంఎల్‌కు 2 సీట్లు ఉన్నాయి. డీఎంకే మిత్రపక్షమైన వీసీకే (VCK) మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించడంతో టీవీకే తన వ్యూహాన్ని మార్చుకుంది. అంతకుముందు అన్నాడీఎంకేతో పొత్తు గురించి జరిగిన చర్చలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీలను కలుపుకుని ఆరుగురు ఎమ్మెల్యేల లోటును భర్తీ చేయాలని విజయ్ భావిస్తున్నారు. తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దళపతి విజయ్ వేస్తున్న అడుగులు ఫలిస్తాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisement

Read Also: రజినీకాంత్ – స్టాలిన్ భేటీ.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×