E-Paper
Advertisement

Borewell Incident in Madhya Pradesh: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Borewell Incident in Madhya Pradesh: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
Advertisement

Three Year old girl died in Bore Well(Today news paper telugu): దేశంలో మరో చిన్నారి బోరు బావికి బలైపోయింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాసర్‌ అనే గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన సౌమ్య అనే మూడేళ్ల చిన్నారి.. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

250 అడుగుల లోతున్న బోరుబావిలో.. బాలిక 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు.. చిన్నారిని రక్షించేందుకు సహాయబృందాలను రంగంలోకి దించారు. పొక్లెయిన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి.. ఐదున్నర గంటల తర్వాత చిన్నారిని బయటికి తీయగలిగారు.

Advertisement

Also Read: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

అప్పటికే సౌమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలికకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొన్ని గంటల తర్వాత ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాప పుట్టిన రోజు నాడే ఈ ఘటన జరిగింది. కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసి.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. అయితే గతేడాది బోరుబావి వేసినప్పటికి నీరు పడలేదు. ఆ తర్వాత బోరుబావిపై మట్టిని వేసి పూడ్చారు. కానీ వర్షాల కారణంగా మట్టి అంతా కిందకి దగిడంతో దాదాపు 25 వరకు గుంత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×