E-Paper
Advertisement

Indian Army: ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. గ్రెనేడ్ విసరడంతో ఐదుగురు జవాన్లు బలి..

Indian Army: ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. గ్రెనేడ్ విసరడంతో ఐదుగురు జవాన్లు బలి..
Advertisement
army-truck-fire-accident

Indian Army: ఆర్మీ జవాన్లు. జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారంతో ఆర్మీ ట్రక్కులో వెళ్తున్నారు. అంతలోనే ఏదో పిడుగుపడిన ఫీలింగ్.

సడెన్‌గా ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు విజృంభించాయి. ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

Advertisement

మొదట ఇది ప్రమాదం కావొచ్చని అనుకున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. అందుకే, పిడుగు పడిందేమోనని సందేహించారు. అసలే పూంచ్ సెక్టార్ కావడంతో ఎందుకైనా మంచిదని విచారణకు ఆదేశించింది ఆర్మీ. ఉగ్ర కోణం ఉందేమోనని ఆరా తీసింది.

ఆర్మీ అధికారుల అనుమానమే నిజమైంది. వర్షం మాటున ఉగ్రవాదులు నక్కారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరారు. గ్రెనేడ్ దాడికి ట్రక్కు కాలిపోయింది. అందులోని జవాన్లు సజీవ దహనం కావడం కలకలం రేపుతోంది.

Advertisement

వెంటనే అప్రమత్తమైన ఆర్మీ.. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. పూంచ్, జమ్మూ రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×