E-Paper
Advertisement

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడులో న‌లుగురు జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడులో న‌లుగురు జవాన్ల మృతి
Advertisement

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో న‌లుగురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లు వీరమరణం పొందారు. మావోయిస్టులు గతంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు (Demining) భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఒక శక్తివంతమైన ఐఈడీని డిప్యూస్ చేస్తుండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్ సుక్రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కొమ్ర, కానిస్టేబుల్ సంజయ్ గత్ పాలే తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా బాంబులను పెద్ద ఎత్తున అమర్చుతున్నారు. గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు వందలాది ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తున్నాయి. తాజా ఘటనతో కాంకేర్ సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతులైన జవాన్ల త్యాగాలను ఉన్నతాధికారులు కొనియాడుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మావోయిస్టుల దాడులను తిప్పికొట్టేందుకు సరిహద్దులో నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Read Also: మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×