E-Paper
Advertisement

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గాలి వాన బీభత్సం..తప్పిన ప్రమాదం.. మూడు విమానాలు డ్యామేజ్, వీడియో వైరల్

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గాలి వాన బీభత్సం..తప్పిన ప్రమాదం.. మూడు విమానాలు డ్యామేజ్, వీడియో వైరల్
Advertisement

Delhi Airport: దేశంలోని నైరుతి రుతుపవనాలు ఉత్తరాది ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో గాలి, వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. బలమైన ఈదురు గాలులకు వర్షం తోడైంది. ఫలితంగా మూడు విమానాలు డ్యామేజ్ అయ్యాయి.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గాలి వాన బీభత్సం

Advertisement

ఆదివారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం వల్ల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఎయిరిండియాకు చెందిన మూడు విమానాలు డ్యామేజ్ అయ్యింది. సడెన్‌గా వచ్చిన పెను గాలులకు విమానాశ్రయ రన్‌వేపై ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు అదుపు తప్పాయి.

ఫలితంగా ఆయా వాహనాలు వేగంగా దూసుకెళ్లి ఎయిరిండియా విమానాలను ఢీ కొట్టాయి. దీనివల్ల ఆయా విమానాలకు భారీ నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. అదుపు తప్పిన వాహనాలను గాలికి రన్ వైపై దూసుకుపోతుండగా వాటిని ఆపడానికి గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది చాలా రిస్క్‌ తీసుకున్నారు.

Advertisement

మూడు విమానాలు డ్యామేజ్, వీడియో వైరల్

ప్రాణాలకు తెగించి పరిగెత్తి, వాటిని ఆపే ప్రయత్నం చేశారు. లేకుంటే మరింత డ్యామేజ్ అయ్యేవని అంటున్నారు. కేవలం సెకన్లలోనే ఆయా వాహనాలు విమానాలను బలంగా ఢీ కొట్టాయి. ఈ ఘటన టెర్మినల్‌-2లో సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. భారీ వర్షం పడుతుండడంతో సిబ్భంది అక్కడ లేరు. దీంతో ఎవరికీ గాయాలు కాలేదు, ప్రాణనష్టం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అయితే వాతావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పు గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విమానాశ్రయ ఆపరేటర్‌కు గానీ, విమానయాన సంస్థలకు ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇతర ఆపరేటర్లకు చెందిన విమానాలు ప్రభావితమయ్యాయని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి.

ALSO READ: మోదీ సర్కార్‌పై పోరుకు ‘ఇండియా కూటమి’ సిద్ధం.. జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు!

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×