E-Paper
Advertisement

Youth Catches Cops: ‘‘చట్టం అందరికీ సమానమే’’.. నడి రోడ్డుపై పోలీసులను నిలదీసిన యువకుడు

Youth Catches Cops: ‘‘చట్టం అందరికీ సమానమే’’.. నడి రోడ్డుపై పోలీసులను నిలదీసిన యువకుడు
Advertisement

Youth Catches Cops: సాధారణ పౌరుడైనా, ప్రభుత్వాధికారైనా, రాజకీయ నాయుకుడైనా చట్టాలను ఫాలో కావాల్సిందే. సామాన్యుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసు అధికారులు చెబుతుంటారు. అదే వారు చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరు నిలదీస్తారు?. ఇందుకు ఓ యువకుడు సమాధానంగా నిలిచాడు. ‘చట్టం అందరికీ సమానమే’ అనే నానుడి రుజువు చేస్తూ ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

Advertisement

మహారాష్ట్రలో థానేలోని అంబికా నగర్లో జరిగిన ఘటనలో ఓ యువకుడు హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అయితే, పోలీసులు అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, వారు నడుపుతున్న స్కూటర్‌కు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడాన్ని ఆ యువకుడు గమనించాడు. ఇంతలో ఆ యువకుడు వారిని వెంబడించి బండిని ఆపాడు. మొత్తం ఘటనను వీడియో తీయడం ప్రారంభించాడు. “మీరు నిబంధనలు పాటించకుండా, మీ బండికే సరైన నంబర్ ప్లేట్ లేకుండా మాకు ఎలా చలాన్లు వేస్తారు?” అని పోలీసులను నిలదీశాడు.

READ ALSO: Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!

Advertisement

పరిణామంతో కంగుతున్న పోలీసులు, ఆ స్కూటర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆ స్కూటర్‌పైపోలీస్స్టిక్కర్ కూడా ఉన్నట్లు వీడియోలో కన్పిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే నిబంధనలు పాటిస్తున్నారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. చలాన్లు వేసే ముందు, పోలీసులు మొదట నిబంధనలు పాటించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×