E-Paper
Advertisement

తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?

తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?
Advertisement

తమిళనాడు రాష్ట్రంలో తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టిస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్.. ఇప్పుడు సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు సమాచారం. తన రాజకీయ ప్రయాణాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు విజయ్ సొంత మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు త‌మిళ‌నాడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విజయ్ తన రాజకీయ అరంగేట్రంతోనే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించారు. 108 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలవడంలో ఇంటర్నెట్ సైన్యం పాత్ర వెలకట్టలేనిది. అయితే అధికారం దక్కించుకునే క్రమంలో ఎదురవుతున్న చిక్కులు.. ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు విజయ్‌ను ఒక కొత్త కోణంలో ఆలోచింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుబంధంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

Advertisement

తమిళ రాజకీయాలను గమనిస్తే.. అధికార డీఎంకే (DMK) కు సన్ నెట్‌వర్క్ వంటి భారీ మీడియా అండదండలు ఉన్నాయి. అటు అన్నాడీఎంకే (AIADMK) కు సైతం జయ టీవీ వంటి సొంత గొంతుక ఉంది. విజయ్ మాత్రం కేవలం సోషల్ మీడియా.. తన వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీడియా సంస్థలు విజయ్‌ను ‘తమిళనాడు వ్యతిరేకి’గా లేదా ‘అనుభవం లేని నాయకుడి’గా చిత్రీకరించడానికి ప్రయత్నించడం టీవీకే వర్గాలను కలవరపెట్టింది. ఈ ‘మీడియా వార్‌’ను తట్టుకోవాలంటే కేవలం యూట్యూబ్.. ఇన్‌స్టాగ్రామ్ సరిపోవని.. ప్రతి ఇంటికీ చేరువయ్యేలా ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ అవసరమని పార్టీ నేతలు విజయ్‌కు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.

కేవలం సోషల్ మీడియాపైనే ఆధారపడటం రాజకీయంగా రిస్క్ అని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు.. ముఖ్యంగా మహిళలకు.. వృద్ధులకు చేరువవ్వాలంటే టీవీ ఛానల్ ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలన్నా.. పార్టీ సిద్ధాంతాలను 24 గంటలూ ప్రజల్లో ఉంచాలన్నా సొంత మీడియా ఉండాల్సిందే. అందుకే విజయ్ కూడా ఒక పక్కా ప్లాన్‌తో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్.

Advertisement

ప్రస్తుతం విజయ్ పూర్తి ఫోకస్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంపైనే ఉంది. గవర్నర్ నిర్ణయం.. అసెంబ్లీలో మెజారిటీ నిరూపణ వంటి కీలక ఘట్టాలు ముగిసిన వెంటనే.. తన రాజకీయ ప్రచార రథానికి మీడియా చక్రాలను జోడించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయ్ సొంతంగా ఛానల్ ప్రారంభిస్తే.. అది తమిళనాడులో డిజిటల్.. సామాజిక విప్లవానికి నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు.

Read Also: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. విజయ్‌కు అష్టకష్టాలు, ఎవరా ఆరుగురు ఎమ్మెల్యేలు?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×