E-Paper
Advertisement

Illicit Liquor Deaths : కల్తీసారా ఘటనలో 52కు చేరిన మృతులు.. సూర్య ఆవేదన

Illicit Liquor Deaths : కల్తీసారా ఘటనలో 52కు చేరిన మృతులు.. సూర్య ఆవేదన
Advertisement

Illicit Liquor Deaths : తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు చికిత్స పొందుతూ 52 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో 113 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు 30 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కల్తీసారా దుర్ఘటన, వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని ఇప్పటికే హైకోర్టు తప్పుపట్టింది.

తాజాగా ఈ ఘటనపై హీరో సూర్య స్పందించారు. ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. చిన్న ఊరులో 50 మరణాలు ఆందోళనకరమన్నారు. తుపాను, వరదలువంటి విపత్తు కాలాల్లోనూ చోటుచేసుకోని విషాదమని ట్వీట్ చేశారు. వరుసగా పెరుగుతున్న మరణాలు, బాధితుల ఆక్రందన మనసును వణికిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది విళుపురం జిల్లాలో మిథనాల్‌ కలిపిన కల్తీసారా తాగి 22 మంది మరణించగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం పనిచేయలేదనడానికి ప్రస్తుత ఘటన నిరూపిస్తోందని తెలిపారు.

Advertisement

మద్యం తాగేవాళ్లు డబ్బు లేనప్పుడు 50 రూపాయలతో కల్తీసారా తాగి బానిసవుతున్నారన్నారు సూర్య. ఈ క్రమంలోనే కల్తీ సారాకు ఆస్కారం దొరుకుతుందని చెప్పారు. మద్యనిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నానని.. ఇప్పటికైనా కల్తీసారా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×