E-Paper
Advertisement

Sofa Politics: ‘పుష్ప’ స్టైల్లో హార్స్ ట్రేడింగులు.. విజయ్‌పై ప్రతిపక్షాలు ఫైర్, అల్లాడిపోతున్న దళపతి

Sofa Politics: ‘పుష్ప’ స్టైల్లో హార్స్ ట్రేడింగులు.. విజయ్‌పై ప్రతిపక్షాలు ఫైర్, అల్లాడిపోతున్న దళపతి
Advertisement

Sofa Politics: తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. అనూహ్యంగా అన్నా డీఎంకేలోని చీలిక వర్గం (22 మంది ఎమ్మెల్యేలు) సైతం విజయ్ కు మద్దతు ఇవ్వడంతో ఆయన బలం 120 నుంచి 144కి చేరింది. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం దక్కించుకోవడం కోసం సీఎం విజయ్.. సోఫా రాజకీయం చేశారని విమర్శించారు.

‘పుష్ప స్టైల్లో రాజకీయాలు’

తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సీఎం విజయ్ పై నిప్పులు చెరిగారు. పుష్ప సినిమా స్టైల్లో విజయ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హార్స్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఇళ్లకు ముందు సోఫాలు పంపించి.. ఆ తర్వాత సీఎం ఎంట్రీ ఇచ్చారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోఫాను ముందు ఎమ్మెల్యేకు పంపిన తర్వాతే పూల బొకేలతో వారి వద్దకు వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను అప్పుగా తీసుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ చురకలు అంటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 65 శాతం మంది ప్రజలు విజయ్ ను తిరస్కరించారంటూ ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నా డీఎంకే సైతం..

Advertisement

మరోవైపు అన్నా డీఎంకే పార్టీ అధినేత, మాజీ సీఎం పళనిస్వామి సైతం బల ప్రదర్శన అనంతరం సీఎం విజయ్ పై విమర్శలు గుప్పించారు. మంత్రి పదవులు, బోర్డు ఛైర్మన్లుగా నియామకం హామీలతో తమ పార్టీ సభ్యులను ప్రలోభపెట్టారని మండిపడ్డారు. తద్వారా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తమిళనాడు చరిత్రలో మునుపెన్నడి జరగని రీతిలో ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం ఆరంభంలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం తనను నిరాశకు గురిచేసిందని అన్నారు.

విజయ్ ఎదురుదాడి..

అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆరోపించింది. ‘ప్రజాతీర్పును అవమానించొద్దు’ అంటూ టీవీకే నేతలు హెచ్చరించారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు విజయ్ సైతం అసెంబ్లీలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలను కొనేంత అవసరం తనకి లేదని అన్నారు.

Advertisement

Also Read: BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు.. ఓటీటీ కూడా ఫ్రీ!

ఇంతకీ ఈ సోఫా కథేంటి..?

‘పుష్ప 2’లో ఈ సోఫాల ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందులో కేంద్రమంత్రి పాత్రలో నటించిన జగపతి బాబుకు హీరో అల్లు అర్జున్ నోట్ల కట్టలతో నిండిన సోఫాను పంపిస్తారు. రావు రమేశ్ పాత్రను ముఖ్యమంత్రిని చేయాలని కోరతారు. అయితే ఇప్పుడు విజయ్ కూడా అదే విధంగా ముఖ్యమంత్రి అయ్యారని పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వడం కోసం ఆయన డబ్బు ఆశచూపారని, రేసు గుర్రాలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలను కొన్నారంటూ అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచిన విజయ్.. కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Also Read: కేంద్రం సంచలనం.. త్వరలో కొత్త గోల్డ్ పాలసీ.. ఇంట్లోని బంగారంపై వడ్డీ చెల్లింపు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×