E-Paper
Advertisement

తమిళనాడు కేబినేట్ ఫిక్స్.. సీఎం విజయ్ సహా.. ఎవరికి ఏ బాధ్యతలు దక్కాయంటే?

తమిళనాడు కేబినేట్ ఫిక్స్.. సీఎం విజయ్ సహా.. ఎవరికి ఏ బాధ్యతలు దక్కాయంటే?
Advertisement

Tamil Nadu Cabinet Portfolios: తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం శనివారం మంత్రుల శాఖలను అధికారికంగా ప్రకటించింది. మే 10న ముఖ్యమంత్రితో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. తాజాగా గవర్నర్ ఆమోదంతో వీరికి కేటాయించిన శాఖల వివరాలను రాజ్ భవన్ వెల్లడించింది. దీంతో విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజాసేవలో నిమగ్నమయ్యేందుకు మార్గం సుగమమైంది.

కీలక శాఖలు.. విజయ్ వద్దే

ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అలాగే పబ్లిక్, సాధారణ పరిపాలన, ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై స్వయంగా దృష్టి పెట్టేందుకే ఆయన హోంశాఖను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మహిళలు, చిన్నారుల సంక్షేమానికి తన పాలనలో పెద్దపేట వేసే క్రమంలో ఆ బాధ్యతలనూ విజయ్ నిర్వర్తించనున్నారు.

ఆర్థిక మంత్రిగా సెంగోట్టయ్యన్

Advertisement

గతంలో ఏఐఏడీఎంకే (AIADMK)లో సుదీర్ఘ అనుభవం గడించి.. ఆ తర్వాత టీవీకేలో చేరిన సీనియర్ రాజకీయ నాయకుడు కె.ఎ. సెంగోట్టయ్యన్‌కు విజయ్ కేబినేట్ లో కీలక శాఖ దక్కింది. ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించారు. ఫైనాన్స్ తో పాటు పెన్షన్ అలవెన్సుల బాధ్యతలను సైతం అప్పగించారు. ఆయనకున్న ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దేందుకు ఉపయోగపడుతుందని సీఎం విజయ్ భావించినట్లు తెలుస్తోంది.

నమ్మకస్తులకు కీలక బాధ్యతలు

ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత నమ్మకస్తుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్)కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, నీటి వనరుల శాఖలను కేటాయించారు. అలాగే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఆధవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్ (భవనాలు, రహదారులు, చిన్న ఓడరేవులు), క్రీడాభివృద్ధి శాఖల బాధ్యతలు దక్కాయి.

Advertisement

Also Read: Best Smartphones: రూ. 40,000 బడ్జెట్ ఉందా? అయితే ఈ 3 పవర్‌ఫుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి!

ఇతర మంత్రుల శాఖలు

మంత్రివర్గంలోని ఇతర సభ్యులకు కూడా సీఎం విజయ్ వివిధ శాఖలను అప్పగించారు. సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ కు విద్యుత్, న్యాయ శాఖలు.. రాజ్‌మోహన్ ఆరుముగంకు పాఠశాల విద్యాశాఖ, తమిళ భాషాభివృద్ధి, సమాచార-పౌరసంబంధాల శాఖను కేటాయించారు. అలాగే డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్ కు వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ.. పి. వెంకటరమణన్ కు ఆహార – పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖను ఇచ్చారు. డాక్టర్ టి.కె. ప్రభు కు పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ అప్పగించారు. మెుత్తంగా చూస్తే సీఎం విజయ్ తన కేబినేట్ కూర్పులో అనుభవజ్ఞులకు, యువతకు సమాన ప్రాధాన్యత కల్పించినట్లు స్పష్టమవుతోంది.

Also Read: రూ. 2,000 అద్దె కట్టలేక.. భార్య, కూతుర్ని.. ఇంటి ఓనర్‌కు అప్పగించిన భర్త!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×