E-Paper
Advertisement

బెంగాల్‌లో సువేందు అధికారి పీఏ హత్య.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ విజువల్స్..

బెంగాల్‌లో సువేందు అధికారి పీఏ హత్య.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ విజువల్స్..
Advertisement

Chandranath Rath murder CCTV video: పశ్చిమ బెంగాల్‌లోని మధ్యమ్‌గ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్రనాథ్ రథ్‌ను దుండగులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి 10:22 గంటల సమయంలో జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే.. నిందితులు అత్యంత పక్కా ప్లాన్‌తో ఈ హత్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. కేవలం ఒక నిమిషం లోపే దుండగులు తమ ఆపరేషన్ ముగించి అక్కడి నుంచి పరారయ్యారు.

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. రాత్రి 10:22 గంటల సమయంలో చంద్రనాథ్ ప్రయాణిస్తున్న తెల్లటి స్కార్పియో కారు రోడ్డుపై వెళ్తూ ఒక చోట ఆగుతుంది. వీడియో ప్రారంభమైన 5వ సెకనులో ఒక బైకర్ ఫ్రేమ్‌లో కనిపిస్తాడు. అతను మరో బైకర్ కోసం ఎదురుచూస్తున్నట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 7వ సెకను వద్ద కారు ఆగగానే.. 9వ సెకనులో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై కారు వైపు వేగంగా వెళ్లారు. వీరిద్దరే షూటర్లని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో మూడో బైక్ కూడా కారు వైపు వెళ్లడం.. ఆ వెంటనే కాల్పుల శబ్దం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

కాల్పులు జరిగిన 50 సెకన్ల తర్వాత.. ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్‌పై వచ్చిన దారిలోనే వెనక్కి అత్యంత వేగంగా వెళ్లడం సీసీటీవీలో రికార్డైంది. ఈ విజువల్స్ ఆధారంగా హత్య మొత్తం నిమిషం లోపే పూర్తయినట్లు పోలీసులు నిర్ధారించారు. కారు అద్దాలను పగులగొట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చంద్రనాథ్‌పై తూటాల వర్షం కురిపించారు. కిల్లర్స్ ప్రొఫెషనల్ గ్యాంగ్ అయి ఉండవచ్చని.. వారి కదలికలను బట్టి వారు చంద్రనాథ్ కోసం మాటు వేసి వేచి చూస్తున్నట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.

మధ్యమ్‌గ్రామ్ పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని.. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన ప్రాణాలకు అత్యంత సన్నిహితుడైన పీఏను ఇలా బహిరంగంగా కాల్చి చంపడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలో రికార్డైన బైక్ నంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Read Also: చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష..!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×