E-Paper
Advertisement

బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు!

బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు!
Advertisement

Suvendu Adhikari PA murdered: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. నందిగ్రామ్, భవానీపూర్ నియోజకవర్గాల నుంచి భారీ విజయం సాధించిన బీజేపీ అగ్రనేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్రనాథ్ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రనాథ్ రథ్‌ తన నలుపు రంగు స్కార్పియో కారులో కూర్చుని ఉన్న సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అత్యంత సమీపం నుంచి (Point-blank range) ఆయనపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Advertisement

సమాచారం అందుకున్న మధ్యమ్‌గ్రామ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తన అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్‌ హత్యకు గురయ్యారని తెలియడంతో సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవికి రేసులో అత్యంత ముందంజలో ఉన్నారు. మే 4న విడుదలైన ఫలితాల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు సాధించి చారిత్రాత్మక విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Read Also: విజయ్ కు మ‌రో షాక్.. క్రిమినల్ కేసు పిటిషన్‌ను విచారించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×