E-Paper
Advertisement

Tihar Jail: తీహార్ జైల్లో సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్ కలకలం…

Tihar Jail: తీహార్ జైల్లో సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్ కలకలం…
Advertisement

Tihar Jail: కరుడుగట్టిన ఖైదీలను ఉంచే జైలుగా తీహార్ జైలుకు ఎప్పటి నుంచో పేరు ఉంది. అటుంటి జైలులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అధికారులు ఉంచారు. ఈక్రమంలో జైల్లో సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్ బయటపడడం కలకలం రేపుతోంది.

జైలు-3లో ఓ ఖైదీ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో.. అధికారులు అతడిని తనిఖీ చేశారు. అతని వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, రెండు ఫోన్లు లభ్యమయ్యాయి. అవి జైలుకు ఎలా వచ్చాయి?.. ఎందుకోసం జైలుకు తీసుకొచ్చారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే కరుడుగట్టిన ఖైదీలను ఉంచే జైలులో మనీశ్ సిసోడియాను ఉంచడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సిసోడియాను హత్య చేయడానికే ఆ జైలులో ఉంచారని.. అక్కడ ఆయనకు ప్రాణహానీ ఉందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈక్రమంలో అధికారులు సిసోడియాను మరో వార్డుకు మార్చారు.

మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను అరెస్ట్ చేయగలరు కానీ.. తనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏం చేయలేరని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులను కూడా బ్రిటీషర్లు జైల్లో పెట్టి వేధించారని.. కానీ వారిలో ఉన్న ఆత్మ స్థైర్యాన్ని తొలగించలేకపోయారని వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×