E-Paper
Advertisement

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
Advertisement

Suprement Court: ఢిల్లీలో విద్యార్థుల ఛలో సంసద్ ఆందోళనపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీడియో ఆధారాలు చూసే సమయం కోర్టుకు లేదని పేర్కొంది. చట్టపరమైన మార్గాలను ఎంచుకోవాలని సూచన చేసింది. పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.

సంసద్‌ మార్చ్‌ నిరసనకారులకు చుక్కెదురు-కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో సంసద్‌ మార్చ్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

Advertisement

పోలీసుల లాఠీఛార్జ్‌పై విచారణకు సుప్రీం నో- అయితే నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. మాకు వీడియోలు చూసే సమయం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. లాఠీఛార్జిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ ఈ సందర్భంగా కోరారు. నీట్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీజేపీ మద్దతుదారులు పార్లమెంటు వైపు నిరసనకారులు దూసుకుకెళ్లారు.

వీడియోలు చూసే టైమ్ లేదన్న సుప్రీం-బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీఛార్జి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారంపై అంతకుముందు పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఈ వ్యవహారాల్లోకి కోర్టులను లాగవద్దంటూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడా వారికి చుక్కెదురైంది.

Advertisement

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలు, నీట్ పరీక్షల్లో అక్రమాలపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు జూలై 20న ఛలో సంసద్ నిరసన చేపట్టారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం పైవిధంగా రియాక్ట్ అయ్యింది.

ALSO READ: ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×