E-Paper
Advertisement

రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు
Advertisement

Supreme Court: తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాన్ని నివారించటానికి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్​ చేసిన తీర్పులను హైకోర్టులు మూడు నెలల్లో వెల్లడించాలని పేర్కొంది. దీనిని ప్రతీ హైకోర్టు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని తెలిపింది.

జార్ఖండ్​ రాష్ట్ర హైకోర్టులో తీర్పుల వెల్లడి, వెబ్​ సైట్​ లో వాటి అప్​ లోడింగ్ లో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై దాఖలైన పిటిషన్​ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అనంతరం తీర్పును వెలువరిస్తూ ఆయా రాష్ట్రాల హైకోర్టులు రిజర్వ్​ చేసిన తీర్పులను మూడు నెలల్లో వెల్లడించాలని పేర్కొంది. రెగ్యులర్​ బెయిల్​ ఉత్తర్వులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే ట్రయల్​ కోర్టులకు అందించాలని తెలిపింది.

Advertisement

బెయిల్​ పొందిన విచారణ ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్​ పూర్తి చేసి అదే రోజున విడుదల చేయాలని పేర్కొంది. ఇక, న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల్లో వాటిని ఆయా హైకోర్టులో అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని ప్రకటించిన తేదీనే ఈ తీర్పు వెల్లడించిన తేదీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: రూ.1500 కోట్ల భూమి కబ్జా.. హైదరాబాద్‌లో వైసీపీ నేతపై కేసు.. పరారీలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే!

Advertisement

మరోవైపు సుప్రీంకోర్టు ఇవాళే మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. సె*క్స్ వర్కర్ల గౌరవ జీవనానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం చట్టబద్దమేనని తెలిపింది. సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు పోలీసులు వారిని వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Also Read: వామ్మో.. పెట్రోల్ బంకుల్లో ఇన్ని సేవలు ఫ్రీగా పొందొచ్చా? ఇన్నాళ్లు తెలియలేదే!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×