E-Paper
Advertisement

వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం

వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం
Advertisement

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల రక్షణ, సె*క్స్ వర్కర్ల గౌరవ జీవనానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం చట్టబద్దమేనని జస్టిస్ జె.బి. పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

‘నచ్చిన వృత్తి ఎంచుకోవచ్చు’

వయోజనులు తమ ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. 18 సంవత్సరాలు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.. తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని పేర్కొంది. లైంగిక కార్మికులు సైతం భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం, సమాన రక్షణ పొందే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేసింది.

పోలీసులకు వార్నింగ్

Advertisement

సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు పోలీసులు వారిని వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా రైడ్స్ చేసినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించవద్దని ఆదేశించింది. మరోవైపు లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ వ్యభిచార గృహాలు నడపడం, ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా ద్వారా ఈ కూపంలోకి దించడం మాత్రం చట్టరీత్యా నేరమని సుప్రీంకోర్టు స్పష్ట చేసింది.

‘కండో*మ్ ఉంటే నేరం కాదు’

అయితే కండోమ్ లు కలిగి ఉండటం కూడా నేరంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ కారణం చేత సె*క్స్ వర్కర్లపై నేరాన్ని మోపరాదని పోలీసులకు సూచించింది. లైంగిక కార్మికుల ప్రైవసీని దెబ్బతీసేలా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించవద్దని వెల్లడించింది. ఇక నుంచి లైంగిక కార్మికులు గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసు వ్యవస్థ నడుచుకోవాలని దిశానిర్దేశం చేసింది.

‘మానవత్వంతో నడుచుకోండి’

Advertisement

మరోవైపు ట్రాఫిక్ అక్రమ రవాణా బాధితులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే సమయంలో వారి పట్ల అత్యంత మానవత్వంతో, సున్నితంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించింది. వారికి తక్షణమే సురక్షితమైన ఆశ్రయం, వైద్య సదుపాయాలు, మానసిక కౌన్సిలింగ్ అందించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. బాధితులు సమాజంలో తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేందుకు వీలుగా తగిన పునరావాస చర్యలు చేపట్టాలని కోర్టు తెలిపింది.

Also Read: 25 పైసల ఖర్చుతో నడిచే.. పోర్టబుల్ ఏసీ వచ్చిందోచ్.. సామాన్యులకు పండగే!

బాధితులకు ఆర్థిక సాయం

మానవ అక్రమ రవాణా బాధితుల కోసం ప్రతీ రాష్ట్రంలోనూ తగినన్ని రక్షణ గృహాలు (షెల్టర్ హోమ్స్) నిర్మించాలని, అక్కడ కనీస వసతులు, నాణ్యమైన ఆహారం ఉండేలా చూడాలని ఆదేశించింది. అలాగే, బాధితులకు ప్రభుత్వ పథకాల ద్వారా తక్షణ ఆర్థిక సాయం మరియు నష్టపరిహారం అందేలా చూడాలని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బాధితుల వ్యక్తిగత వివరాలు, వారి ఫోటోలు లేదా చిరునామాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా పూర్తి గోప్యతను పాటించాలని కోర్టు కఠిన నిబంధనలను విధించింది.

Also Read: Split vs window vs portable AC: ఇంటికి ఏ ఏసీ బెస్ట్? కరెంట్ బిల్లు తక్కువ వచ్చేది ఏది?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×